
ఆ కంప్లైంట్ ఆటోమేటిక్గా మన డిజిటల్ సర్వేలోకి వచ్చేస్తుందని దీనివల్ల మన ప్రభుత్వం అధికారంలోకి రాగవగానే వెంటనే ఈ ఫిర్యాదుల పైన కచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్యాయానికి గురైన వారందరికీ కూడా ఈ యాప్ ద్వారా ఫిర్యాదులు చేసుకోవచ్చని తెలిపారు. తప్పు చేసిన వారందరికీ ఖచ్చితంగా సినిమా చూపించడం ఖాయమని.. చంద్రబాబు ఏదైతే విత్తినారో.. అది చెట్టవుతొంది అంటూ తెలిపారు.
ఏపీలో చాలా భయానకమైన వాతావరణాన్ని సృష్టించారు. వైసిపి నేతలపైన కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెడుతున్నారు ఇదే సంప్రదాయం కొనసాగితే టిడిపిలో ఎవరు ఉండరని అందరూ కచ్చితంగా జైలుకు వెళ్లాల్సి ఉంటుందంటూ హెచ్చరించారు. అన్యాయంగా మిథున్ రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి లను అరెస్టు చేశారని రాజకీయాలలోకి వారు నా ద్వారా వచ్చారు. కేవలం వేదించాలని ఉద్దేశంతోనే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టారని.. పార్టీలో కీలకంగా ఉన్న వారి పైన అక్రమ కేసులు పెడుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు జగన్.
అలాగే పార్టీలో ఉండే మహిళా నేతలను అసభ్య పదాలతో అవమానిస్తున్నారని ప్రజల తరుపున గొంతు వినిపిస్తున్న వారందరినీ కూడా అణిచి వేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.. చెప్పిన హామీలను అమలు చేయక చాలా ఘోరంగా పాలిస్తున్నారంటూ తెలిపారు.