మన దేశం మీద దాదాపు వందల ఏళ్లపాటు పాలన సాగించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు, మన సాంస్కృతిక సంపదను, విలువైన ఆస్తులను తమ దేశాలకు తరలించిన ఘోర చరిత్ర అందరికీ తెలిసిందే. కోహినూర్ వజ్రం, నెమలి సింహాసనం వంటి విలువైన వస్తువులే కాదు... ఈ జాబితాలో ఇప్పుడు బుద్ధుని పవిత్ర అవశేషాలు కూడా చేరాయి. కానీ శతాబ్దం తర్వాత... ఇప్పుడు ఆ అవశేషాలు తిరిగి భారతదేశానికి వచ్చాయి! పిస్రాహ్వాలో బయటపడిన పవిత్ర ఆస్తి .. 1898లో యూపీలోని పిస్రాహ్వా గ్రామంలో జరిగిన పురావస్తు తవ్వకాల్లో బుద్ధుని పవిత్ర అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. సిద్ధార్థనగర్ జిల్లాలోని ఈ ప్రదేశం, బుద్ధుడు జన్మించిన లుంబినీకి కేవలం తొమ్మిది మైళ్ల దూరంలో ఉంది. ఈ తవ్వకాల్లో బయటపడ్డ అవశేషాలను నాటి బ్రిటీష్ పాలకులు ఎప్పటిలాగే "విలువైన సొత్తు"గా భావించి యూకేకు తరలించారు. వాటితో పాటు బంగారు ఆభరణాలు, రత్నాలూ తీసుకెళ్లారు.


అవశేషాల వేలం.. భారత్ ఘన విజయమే! .. ఈ ఏడాది ప్రారంభంలో ఒక అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన వేలంలో ఈ అవశేషాలు మళ్లీ ప్రపంచ దృష్టిలోకి వచ్చాయి. ఇదే సరైన సమయమని భావించిన మోడీ ప్రభుత్వం, ఈ పవిత్ర అవశేషాలను భారత్‌కు తిరిగి తీసుకురావాలని తీవ్రంగా శ్రమించింది. సుదీర్ఘ కృషితో చివరికి బ్రిటన్ మన్నించి, అవశేషాలను తిరిగి అప్పగించింది. ఇప్పుడు అవి భారత్‌కు చేరుకోవడం, భారతీయ సంస్కృతికి, భౌతిక వారసత్వానికి గొప్ప విజయంగా పరిగణించాల్సిందే. మోడీ ధన్యవాదాలు.. దేశం గర్వపడే రోజు! .. ఈ గౌరవవంతమైన సందర్భాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. “శతాబ్దాల తర్వాత బుద్ధుని పవిత్ర అవశేషాలు స్వదేశానికి తిరిగొచ్చాయి. ఇది భారతీయ సంస్కృతికి గర్వించదగిన రోజు,” అని మోడీ పేర్కొన్నారు. ఈ అవశేషాలను తిరిగి పొందేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.



బుద్ధుని స్థలానికి గౌరవాన్ని తిరిగి తీసుకొచ్చిన ఘట్టం .. బుద్ధుని నిర్యాణం తర్వాత, ఆయన అవశేషాలను అనేక రాజ్యాల మధ్య భాగాలుగా పంచినట్టు చరిత్ర చెబుతుంది. వాటిలో కొంత భాగాన్ని సియామ్ (ఇప్పటి థాయిలాండ్) రాజుకు అప్పజెప్పినట్టు ఆధారాలున్నాయి. ఇప్పుడు కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియంలో ఉన్న సున్నపురాయి మ్రతపెట్టికతో పాటు... పిస్రాహ్వాలో వెలికితీసిన అవశేషాలు తిరిగి భారత్‌కి రావడం అంటే... ఇది కేవలం చారిత్రక ఘట్టమే కాదు, దేశ గర్వానికీ ప్రతీక. వెల కట్టలేని ఆస్తి.. తిరిగి స్వదేశంలో! ..  బుద్ధుని పవిత్ర అవశేషాలు లాంటి అమూల్యమైన సంపద తిరిగి మన దేశానికి రావడం అనేది అనూహ్యమైన ఘట్టం. వందల ఏళ్ల తర్వాత దేశపు గొప్ప చరిత్ర మళ్లీ శ్వాస తీసుకుంటోంది. ఇది ఒక్క బౌద్ధులకు మాత్రమే కాదు, భారతీయులందరికీ మానసికంగా గర్వించదగిన క్షణం. ఏ యుద్ధం లేకుండా సాధించిన ఈ విజయానికి ప్రజలు మోడీ సర్కారును అభినందిస్తున్నారు. "ఇది పవిత్ర చరిత్రకు న్యాయం చేసిన ఘట్టం!" అని గర్వంగా చెప్పుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: