
అయితే ఇటీవలే వైసిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో చాలామంది నాయకులు కూడా జగన్ వ్యక్తిగత భద్రత మీద చాలా ఆందోళనను తెలియజేశారు. జడ్ ప్లస్ కేటగిరి కలిగి ఉన్న జగన్ కి సెక్యూరిటీని సరిగ్గా ఇవ్వడం లేదంటూ తెలియజేశారు. ఇటీవలే జగన్ జిల్లాల పర్యటనలో భాగంగా భద్రతా లోపాలు చాలా స్పష్టంగా కనిపించాయని తెలుపుతున్నారు. ఇక ప్రభుత్వం నుంచి అయితే మొక్కుబడిగానే భద్రత కనిపిస్తూ ఉండడంతో ఈ విషయంపై జగన్ కొత్తగా 40 మంది దాకా మాజీ ఆర్మీ అధికారులతో ప్రత్యేకంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారట.
జగన్ చుట్టూ వలయంగా వీరందరూ ఉంటారని.. అలాగే రోప్ పార్టీగా కూడా వీరే పని చేస్తారని సమాచారం .జగన్ కొత్త ఆర్మీ ఈనెల 6న కర్నూలు జిల్లా డోన్ లో పర్యటించే సందర్భంగా విధులలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో తన జిల్లాల పర్యటనలను మరింత పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే గ్రామాలలో కూడా జగన్ వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రతిసారి భద్రత కోసం ప్రభుత్వం వైపు చూడకుండా తానే సొంతంగా ఒక రక్షణ వలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి జగన్ కు సొంత ఆర్మీ ఏవిధంగా రక్షణ కల్పిస్తుందో చూడాలి.