అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ఆగ్రహాన్ని భారత్‌పై చూపించారు. ఇప్పటికే ఉన్న 25 శాతం టారిఫ్‌లు (సుంకాలు) రెండింతలు చేసి 50 శాతానికి పెంచుతూ సంచలన ప్రకటన చేశారు. ఇది కేవలం వాణిజ్య నిర్ణయం కాదు, ఒక ఆర్థిక యుద్ధానికి నాంది అనే చెప్పాలి. ట్రంప్ ఈ దెబ్బ ఎందుకు కొట్టారంటే – భారత్ , రష్యా చమురు కొనుగోళ్లు ఆపకపోవడమే ప్రధాన కారణం. అమెరికా ఆంక్షల్ని లెక్కచేయకుండా భారత్ తన ఆర్థిక ప్రయోజనాల కోసం ముందుకు పోవడాన్ని అమెరికా తట్టుకోలేకపోయింది.


ఈ దెబ్బ ఎవ్వరి మీద పడబోతోంది? .. డైమండ్, జ్యువెలరీ, వస్త్రాలు, కెమికల్స్ వంటి రంగాలకే ఈ టారిఫ్‌లు భారీగా బరువయ్యేలా ఉన్నాయి. ఈ రంగాలు అమెరికా మార్కెట్‌పై బాగా ఆధారపడినవి. యూబీఎస్ లెక్కల ప్రకారం ఏకంగా $8 బిలియన్ల విలువైన భారత ఎగుమతులు ఈ టారిఫ్‌లతో దెబ్బతింటాయని అంచనా. MSMEలు, లెదర్ గూడ్స్, ఆక్వా కల్చర్ వంటి చిన్నతరహా పరిశ్రమలు ఇప్పటికే పోటీతో సతమతమవుతుండగా, ఇప్పుడు ఈ టారిఫ్‌లు వాళ్ళ పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉంది. స్టాక్ మార్కెట్ మాత్రం స్టేడీగా ఉందే..! .. ఐటీ, ఫార్మా, మౌలిక వనరుల రంగాలపై ట్రంప్ టారిఫ్ ప్రభావం తక్కువగా ఉంటుంది. స్టాక్ మార్కెట్‌పై కూడా ఈ ప్రభావం తక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నిఫ్టీ కంపెనీల్లో అమెరికాతో డైరెక్ట్ బిజినెస్ ఉన్నవాటి శాతం చాలా తక్కువగా ఉంది.


భారత్ కౌంటర్ స్ట్రాటజీ – దూకుడు కాలం వచ్చింది! .. ఈ దెబ్బను అవకాశంగా మలచుకోవాల్సిన సమయం ఇది. ఆనంద్ మహీంద్రా చెప్పినట్లుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు ఊపునివ్వాలి. విదేశీ పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించాలి. MSMEలకు నిధులు, తక్షణ ప్యాకేజీలు అవసరం. పర్యాటక రంగాన్ని బలోపేతం చేసి ఫారెక్స్ ఆదాయాన్ని పెంచాలి. దిగుమతులపై సుంకాలను సర్దుబాటు చేసి దేశీయ తయారీ రంగానికి ప్రోత్సాహం ఇవ్వాలి. పరిస్థితి ఆందోళనకరం... కానీ పరిష్కారం ఉంది! .. ట్రంప్ టారిఫ్‌లు షాక్ ఇచ్చినా, భారత ఆర్థిక వ్యవస్థను మట్టికరిపించలేవు. ఇది తాత్కాలిక ఒత్తిడే. వ్యూహాత్మకంగా అంచెలంచెలుగా ఎదిగే మార్గాన్ని భారత్ ఎంచుకుంటే – ఈ టారిఫ్‌ల దెబ్బ దారి తప్పించిన పాఠంగా మిగిలిపోతుంది. క్లారిటీ గల పోరాటం.. శక్తివంతమైన ప్రతిస్పందన – ఇది భారత్‌కు సమయ పరీక్ష!

మరింత సమాచారం తెలుసుకోండి: