
నిందితులు సరోగసీ పేరుతో ఆశావహ దంపతుల నుంచి రూ.30 లక్షల వరకు వసూలు చేసినట్లు డీసీపీ రష్మీ వెల్లడించారు. ఆడశిశువుకు రూ.3.50 లక్షలు, మగశిశువుకు రూ.4.50 లక్షలుగా ధరలు నిర్ణయించినట్లు తెలిపారు. ఒక జంట డీఎన్‌ఏ టెస్ట్ ద్వారా తమకు ఇచ్చిన శిశువు తమ బయోలాజికల్ సంబంధం లేనిదని గుర్తించడంతో ఈ కుంభకోణం బయటపడింది. ఇప్పటివరకు 15 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.నిందితులు గర్భిణీ స్త్రీలను ఆసరాగా చేసుకుని, వారి నుంచి శిశువులను కొనుగోలు చేసి, సరోగసీ పేరుతో ఇతర జంటలకు అమ్మినట్లు దర్యాప్తులో తేలింది. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్‌కు చెందిన వైద్యులు ఉష, రవి కూడా ఈ కేసులో అరెస్టయ్యారు.
వీరు హాస్పిటల్ విధులతో పాటు సృష్టి సెంటర్‌లో సేవలు అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.ఈ కుంభకోణం బయటపడటంతో ఫెర్టిలిటి సెంటర్లపై నియంత్రణను కఠినతరం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. డీసీపీ రష్మీ పెరుమాల్ ప్రజలకు సూచనలు జారీ చేస్తూ, లైసెన్స్ ఉన్న సంస్థలను మాత్రమే సంప్రదించాలని కోరారు. ఈ కేసు దేశవ్యాప్తంగా ఫెర్టిలిటి సెంటర్ల నిర్వహణపై కొత్త చర్చకు దారితీసింది. బాధితులు పోలీసులను సంప్రదించి న్యాయం కోరాలని అధికారులు సూచిస్తున్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు