కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలపై గత కొంతకాలంగా పెద్ద ఎత్తున చేసిన ప్రచారం అంతా చివరికి కట్టు కథలేనని తేలిపోయింది. దేశవ్యాప్తంగా హిందువులు ఆరాధించే ఈ పవిత్రమైన ఆలయాన్ని కించపరచడానికే ఒక దుష్ప్రచారం నడిపారని ఇప్పుడు స్పష్టమైంది. వందలాది మహిళలను చంపేశారంటూ, ఆలయ ప్రాంగణంలో భయంకరమైన ఘటనలు జరిగాయంటూ విపరీతమైన ఫేక్ న్యూస్‌ను పుట్టించేశారు. ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు కోర్టులో వేసిన పిటిషన్ ఆధారంగా కథలు కట్టేశారు. అసలు విషయం ఏమిటన్నది చూడకుండా ‘ఇదిగో తోక అంటే అదిగో పులి’ అన్నట్లుగా మీడియా, సోషల్ మీడియాలో కొందరు గాలంపట్టారు. పుణ్యక్షేత్రం పేరును మట్టిపాలు చేసేలా తప్పుడు ప్రచారాలు నడిపించారు. కానీ తర్వాత కోర్టు విచారణలో, పోలీసుల దర్యాప్తులో అవన్నీ పచ్చి అబద్ధాలేనని తేలిపోయింది.


రాజకీయ కోణం స్పష్టమైంది .. ఈ కుట్రల వెనుక రాజకీయ కోణం ఉన్నట్టే కనిపిస్తోంది. ధర్మస్థల ట్రస్ట్‌పై ఆధిపత్యం సాధించుకోవాలన్న కక్షతోనే ఈ మాయమాటలు నడిపారు. కోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చకపోతే మరింత పెద్ద ఎత్తున ఈ అబద్ధాలు వ్యాపించి ఉండేవి. తవ్వకాల్లో ఏమీ దొరకకపోయినా “ఏదో దొరికింది” అని పెద్ద‌ గా ప్రచారం చేశారు. చివరికి ఆడిన ఆట బట్టబయలైంది. ఒక్క ధర్మస్థలమే కాదు, తిరుమలకూ లక్ష్యమే .. ఇక్కడితో ఆగడం లేదు. ఇదే తరహా ఫేక్ దాడులు  తిరుమల శ్రీవారి దేవస్థానం (TTD) పై కూడా చేస్తున్నారు. హిందూ విశ్వాసానికి కేంద్రబిందువైన ఆలయాల ప్రతిష్టను బూర్జువా రాజకీయాల కోసం తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరుగుతోంది. ఇది కేవలం ఒక ఆలయాన్ని కించపరచడమే కాదు, మొత్తం హిందూ భావజాలంపై దాడి అని చాలా మంది భావిస్తున్నారు.



ఆలయాలపై కుట్రలకు అడ్డుకట్ట వేయాలి .. ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేసి, తర్వాత అవి తప్పుడు అని తేలిపోవడం కొత్తేమీ కాదు. కానీ ఈ దుష్ప్రచారాలు పవిత్రమైన క్షేత్రాల ప్రతిష్టకు మచ్చ తెస్తున్నాయి. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే గొంతుతో “ఆలయాలపై కుట్రలకు అడ్డుకట్ట వేయాలి” అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హిందూ క్షేత్రాలను టార్గెట్ చేసే ఈ తరహా ఫేక్ న్యూస్, రాజకీయ ఆటలు కొనసాగితే విశ్వాసం దెబ్బతింటుంది. అందుకే ఇలాంటి ప్రయత్నాలను కఠినంగా అరికట్టి, నిజం బట్టబయలు చేస్తూ వెళ్ళడమే ఒక్క మార్గం. అప్పుడే పుణ్యక్షేత్రాల గౌరవం నిలుస్తుంది, హిందూత్వం కాపాడబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: