తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జిల్లా స్థాయిలో కీలకమైన మార్పులు చేపట్టే దిశగా హైకమాండ్ కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా ఏలూరు జిల్లా అధ్యక్షుడి పదవి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2019 ఎన్నికల తర్వాత గన్ని వీరాంజనేయులు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి వైసిపి పాలనకు గట్టి ప్రతిఘటనగా నిలిచి, జిల్లాలో టిడిపి బలోపేతానికి కీలకంగా పని చేశారు. గత ఎన్నికల్లో కూడా పార్టీ సూచన మేరకు తన ఉంగుటూరు టికెట్‌ను త్యాగం చేసి, కూటమి విజయంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన కృషికి గుర్తింపుగా తాజాగా ఆప్కాబ్ చైర్మన్ పదవిని కూడా కట్టబెట్టింది.

అయితే, ఇప్పుడు జిల్లా బాస్ స్థానంలో మార్పు వస్తుందా? లేక గన్నినే కొనసాగిస్తారా? అన్నది హాట్ చర్చగా మారింది. ఈ క్రమంలో హైకమాండ్ నియోజకవర్గాల వారీగా అభిప్రాయ సేకరణ ప్రారంభించింది. ఏలూరులో ఈరోజు జరిగిన కీలక సమావేశంలో మంత్రి గొట్టపాటి రవి, పార్టీ పరిశీలకులు నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ రేసులో ప్రస్తుతం నాలుగు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి ప్రధానంగా చర్చలో ఉన్నారు. వీరితో పాటు మరికొంత మంది నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఘంటా మురళి రాష్ట్ర నాయకత్వానికి దగ్గరగా ఉన్న నేతగా పేరుపొందారు. ఆయన క్రియాశీలకంగా ఉండటమే కాకుండా, యువతతోనూ బలమైన అనుసంధానం కలిగి ఉన్నారని చెబుతున్నారు.


మరవైపు చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి వంటి నేతలు మంత్రి పదవిపై అసలుు పెట్టకపోవడంతో ఈ జిల్లా అధ్యక్ష పదవి పై అంతక ఆసక్తి చూపటం లేనట్టుు తెలుస్తుంది .. రాజకీయ విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరగా ఉండటంతో, జిల్లాలో పార్టీ బలం నిలుపుకోవడమే కాకుండా, వైసీపీని పూర్తిగా క్లీనుగా చేయాలనే ఉద్దేశ్యంతో టీడీపీ హైకమాండ్ బలమైన లీడర్‌షిప్‌ను ఇక్కడ సెట్ చేయాలని చూస్తోంది.  అందుకే గంటా మురళి పేరు బలంగా వినిపిస్తోంది. ఇలా మొత్తానికి – “ఏలూరు జిల్లా టిడిపి బాస్‌గా గంటా మురళి అవుతారా..? లేక సీనియర్ నేతల ఒత్తిళ్లతో హైకమాండ్ మరో నిర్ణయం తీసుకుంటుందా..?” అన్నది ఇప్పుడు ఏలూరు రాజకీయాల్లో హాట్ డిబేట్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: