కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న ఒక కొత్త బిల్లు చాలామంది రాజకీయ నేతల్లో కలవరం సృష్టిస్తోంది. అయితే ఇంతకుముందు రాజకీయ నాయకులు చాలామంది కొన్ని కేసుల్లో జైల్లో కూడా ఉండి వచ్చారు. అలాంటి వారే ప్రస్తుతం ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అయితే వరుసగా 30 రోజులు జైల్లో ఉండే వ్యక్తి 31వ రోజు ఎలాంటి పదవిలో ఉన్నా తొలగించాలని కేంద్రం ప్రభుత్వం చట్టం చేయబోతోంది. అలాంటి ఈ తరుణంలో ప్రకాష్ రాజ్  ఒక ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్విట్ సోషల్ మీడియాలో విపరీతంగా హల్ చల్ అవుతోంది. ఇంతకీ ఆ ట్విట్  ఏంటయ్యా అంటే.. 

మహాప్రభో  తమరు కొత్తగా ప్రవేశపెడుతున్న బిల్లు వెనుక , మాజీ ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ తమ మాట వినకపోతే అరెస్టు చేసి, “మీ మాట వినే ఉప ముఖ్యమంత్రిని” ముఖ్యమంత్రి చేసే కుట్ర ఏమైనా ఉందా ? అంటూ ప్రశ్నించాడు. అయితే దీనిపై రకరకాలుగా స్పందనలు వస్తున్నాయి. అవేంటో చూద్దాం.. అయితే కేంద్రం తీసుకురాబోతున్న ఈ బిల్లును ఆంధ్రాకు ముడిపెట్టి ప్రకాష్ రాజ్ ఈ ట్విట్ చేసినట్టే కనబడుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఒక కేసు ఉంది. కాబట్టి దాని గురించే ప్రకాష్ రాజ్ మాట్లాడారు. ఒకవేళ చంద్రబాబు ఏవైనా కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆయనపై ఉన్న పాత కేసులు తీసి అరెస్టు చేసి జైల్లో పెడితే, పవన్ కళ్యాణ్ ను సీఎం చేసే ఉద్దేశం ఉందా అంటూ ఒక చిన్న విషయాన్ని బయట పెట్టారు.

 ఈ విధంగా టిడిపి మరియు చంద్రబాబులో ఓ అప నమ్మకం క్రియేట్ చేశాడు. ఈ విధంగా జరిగితే మాత్రం ముఖ్యమంత్రి ప్లేస్ లో భువనేశ్వరి లేదంటే లోకేష్ వస్తారు. పవన్ కళ్యాణ్ కి సీఎం ఇస్తానని వారు ఎప్పుడు కూడా చెప్పలేదు. పవన్ కళ్యాణ్  ఈ పదవిని వద్దనుకున్న సందర్భం ఉంది. అక్కడ తొలగించడం మాత్రమే ఉంది కానీ ఎవరిని పెట్టాలనేది ఆ చట్టంలో లేదు. ఆ పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరిని సీఎంగా ఎన్నుకుంటే వారు ముఖ్యమంత్రిగా అవుతారు. ఈ విధంగా ప్రకాష్ రాజ్  ఏపీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మద్యం సీఎం సీటు వివాదం సృష్టించి సైలెంట్ గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: