కవిత బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత అంతటి స్థానాన్ని అధిరోహించిన  నాయకురాలు.. కేసీఆర్ కుటుంబంలో ఎంతమంది ఉన్నా తండ్రి లాగా వాక్చాతుర్యం కలిగిన ఏకైక నాయకురాలు ఈమె.. అప్పట్లో తండ్రి వెంట తిరుగుతున్న సమయంలో భవిష్యత్తులో బీఆర్ఎస్ ను కాపాడేది కవితే అంటూ చాలామంది సంబోధించారు. ఆ విధంగా  తండ్రికి తగ్గ తనయురాలిగా అద్భుతమైన నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి కవిత ప్రస్తుతం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని కేసీఆర్ అభిమానులు భావిస్తున్నారు.. అసలు కవితకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందే కేసీఆర్.. కవిత పేరుకు ముందు వెనకాల కేసీఆర్ అనే పేరు లేకపోతే ఈమె పేరు ఎవరికీ తెలిసేది కాదు. కేసీఆర్ వేసిన బాటపై నడక నేర్చుకున్న కవిత, ఆయన బాటకే అడ్డుకట్ట వేస్తూ వస్తోంది.


దాదాపు 20 సంవత్సరాల నుంచి పార్టీని కాపాడుకుంటూ వస్తున్న కవిత ఉద్యమం నుంచి మొదలు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కునే సమయం వరకు తన నాన్నకు తోడు నీడగా ఉంది.. అలాగే అద్భుతమైన పాలన అందించడంలో కేసీఆర్ కు ఎన్నో సలహాలు సూచనలు కూడా ఇచ్చేదట.. అలాంటి కవిత బీఆర్ఎస్ పార్టీకి జాగృతి అధ్యక్షురాలుగా కొనసాగుతూ తెలంగాణలో బతుకమ్మ పండుగ గురించి ఎంతో ప్రచారం చేసింది. దేశ విదేశాల్లో కూడా బతుకమ్మ విశిష్టతను తెలియజేసింది. అలాంటి ఈమె మొదటిసారి  2014లో నిజామాబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేసి అద్భుతమైన మెజారిటీతో గెలుపొందింది. ఆ తర్వాత 2019లో మళ్లీ నిజామాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమిపాలైంది. ఆ తర్వాత 2020 లో జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి కవిత గెలుపొందారు. 2021 శాసనమండలి ఎన్నికల్లో ఏకగ్రీవమయ్యారు.  

అప్పటినుంచి ఇప్పటివరకు ఆమె ఎమ్మెల్సీగా కొనసాగుతూనే ఉన్నారు.  ఇంతలో 2023లో ఆమెపై లిక్కర్ కేసు నమోదవ్వడం..  ఆమె అరెస్టయ్యి నాలుగు నెలలు జైలుకు వెళ్లడం  జరిగింది. ఆ తర్వాత జైలు నుంచి వచ్చిన కవిత తిరుగుబాటు బావుట ఎగురవేస్తూ బీఆర్ఎస్ పై ధిక్కారస్వరాన్ని వినిపించింది. చివరికి పార్టీ నుంచి సస్పెండ్ అయింది. ఒకప్పుడు తండ్రికి ఎంతో బాసటగా ఉంటూ పార్టీ బలోపేతానికి సహకారం అందించిన కవిత ప్రస్తుతం  ఆ పార్టీతోనే రగడ పెట్టుకుని పార్టీ నుంచి సస్పెండ్ అయింది.. మరి కవిత ముందు ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: