- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . .

తెలంగాణ రాజకీయమంతా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపయోగించి కేంద్రంగా సాగుతోంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఎంపికపై కసరత్తులు చేస్తున్న క్రమంలో ఆసక్తికర ములుపు తిరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ కవితతో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి భేటీ కావడం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాలలో సంచలనంగా మారింది. తాజాగా విష్ణువర్ధన్ కవిత నివాసానికి వెళ్లి ఆమెతో అరగంటపైగా చర్చించారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక‌ల గురించే వీరి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగి ఉంటుంద‌ని ప్రచారం జరుగుతోంది. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన విష్ణువర్ధన్ రెడ్డి పెద్దమ్మ తల్లి దసరా నవరాత్రి వేడుకలకు కవితను ఆహ్వానించేందుకు వచ్చినట్టు చెప్పారు.


తెలంగాణ భవన్ , కేసీఆర్ తోనే తన ప్రయాణం అని స్పష్టం చేశారు. విష్ణువర్ధన్ రెడ్డి పైకి అలా చెప్పిన కవితతో సమావేశంలో అంత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించే చర్చ జరిగినట్టు ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ పైకి పీజేఆర్ అస్త్రం ప్రయోగించాలని కవిత ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ పిజెఆర్ కుటుంబానికి బలమైన ఓటు బ్యాంకు ఉంది. అటు బిఆర్ఎస్ దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతనే పోటీ చేయించే ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో అక్కడ బలమైన ఓటు బ్యాంకు కలిగిన పిజేఆర్ వారసుడు విష్ణువర్ధన్ రెడ్డిని తమ పార్టీ నుంచి పోటీకి పెడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ కు దెబ్బ పడుతుంది అని కవిత భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: