రేపటి రోజున భారతదేశంలో కొత్త జీఎస్టీ రేటు అమలులోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాన మంత్రి మోదీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి మరి ప్రసంగించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రసంగంలో పలు కీలకమైన ప్రకటనలు చేయవచ్చు అనే అభిప్రాయాలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే మోదీ ప్రసంగం దేని గురించి ఉంటుందనే విషయం పై సరైన స్పష్టత లేదు. కానీ చాలామంది కొత్త జీఎస్టీ రేట్ల వ్యవహారం గురించి, వస్తువుల ధరలు తగ్గే అవకాశాల గురించి సామాన్య ప్రజలకు కలిగే ప్రయోజనం గురించి మాట్లాడబోతున్నట్లు వినిపిస్తోంది.


అలాగే దీపావళి ,దసరా పండుగ సీజన్ కావడంతో 140 కోట్ల మంది ప్రజలకు పలు వరాలను కురిపించే అవకాశం ఉన్నట్లు వినిపిస్తోంది.. ముఖ్యంగా వంట గ్యాస్ సిలిండర్ల తగ్గింపు ప్రస్తావన అలాగే పెట్రోల్, డీజిల్ రేట్లపైన భారీ ఊరట కలిగించబోతున్నట్లు వినిపిస్తున్నాయి. మరి ఏంటి అసలు విషయం అన్నది తెలియాలి అంటే సాయంత్రం 5 గంటల వరకు ఆగాల్సిందే.. ఇటీవలే జీఎస్టీలో కేంద్రం పలు సంస్కరణలు తీసుకువచ్చింది.. ఇకమీదట 5,18,40 శాతం పన్ను స్లాబ్లోనే ఉంటాయని తెలియజేశారు.


200కు పైగా వస్తువుల పైన పన్ను తగ్గించి సామాన్యులకు, మధ్యతరగతులకు కేంద్రం ఊరట కలిగించబోతోంది.. గతంలో 12 శాతం స్లాబ్ లో 99 వస్తువులు ఉండగా.. 5% స్లాబ్ లోకి వచ్చేస్తాయి. 28% స్లాబులో ఉన్న 90% వస్తువులు 18 శాతానికి వచ్చేస్తాయి. దీపావళి, దసరా పండుగ నేపథ్యంలో కొనేవారికి ఈ పన్ను రేటు తగ్గించడంతో ఆదాయం పెరుగుతుందని అంచనా కేంద్ర ప్రభుత్వం వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ప్రసంగంలో మాట్లాడే అవకాశం ఉన్నట్లు వినిపిస్తున్నాయి. అలాగే  ట్రంపు విధిస్తున్న 50% టారిఫ్, H -1B వీసాల ఫీజుల పై కూడా ప్రసంగం చేయవచ్చు అన్నట్టుగా అంచనా వేస్తున్నారు రాజకీయ నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: