పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్లో రూపొందిన 'ఓజీ' చిత్రంపై అభిమానులతో పాటు ప్రేక్షకులందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. హైదరాబాద్‌ నగరంలో ఈ సినిమా బుకింగ్స్‌ అంచనాలకు మించి దూసుకుపోతున్నాయి. మొదటి రోజుకే రికార్డు స్థాయిలో బుకింగ్స్ నమోదు కావడం సినిమాపై ఉన్న హైప్‌ని మరింత పెంచుతోంది.

ఇప్పటికే ఫస్ట్ డే బుకింగ్స్ విషయంలో ఓజీ అనేక రికార్డులను బద్దలు కొడుతున్నట్లుగా తెలుస్తోంది. సినిమా విడుదల కాకముందే ఈ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుండటం చూస్తుంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో మరోసారి రుజువవుతోంది. సుజీత్ దర్శకత్వం, పవన్ కళ్యాణ్ స్టైల్ కలసి 'ఓజీ' ఒక విజువల్ ట్రీట్‌గా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇక సినిమా విడుదలైన తర్వాత ఓజీ కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ స్థాయిలో అంచనాలు ఉన్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. ఈరోజు సాయంత్రం ఓజీ మూవీ ట్రైలర్ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

ఓజీ సినిమా ఫస్ట్  డే కలెక్షన్లు మాత్రం న భూతో  న భవిష్యత్  అనేలా ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది.  ఓజీ సినిమా  ఇతర భాషల్లో సైతం సంచలన విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఓజీ సరికొత్త రికార్డులు సాధించి ఇండస్ట్రీని షేక్ చేయాలనీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: