
అన్ని భాషలలో కూడా భారీగానే కలెక్షన్స్ రాబడుతోంది మిరాయ్. ఇందులో రితిక నాయక్, జగపతిబాబు, మంచు మనోజ్, శ్రియ కీలకమైన పాత్రలో నటించారు ఇప్పటికే ఈ సినిమా రూ .100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసి రూ.200 కోట్లు మార్క్ దిశగా అడుగులు వేస్తోంది. తేజ సజ్జా కెరియర్ లోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్టుగా మిరాయ్ సినిమా నిలుస్తోంది. తాజాగా ఈ చిత్రం అమెరికాలో 2.5 మిలియన్ డాలర్లు మార్క్ ని క్రాస్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో తేజ సజ్జా అభిమానులు కూడా ఆనందపడుతున్నారు.
అమెరికా వంటి ప్రాంతాలలో ప్రభాస్, ఎన్టీఆర్ తరువాత ఇలాంటి రికార్డ్ సృష్టించిన హీరోగా పేరు సంపాదించారు తేజ సజ్జా. ఎన్నో సినిమాల తర్వాత స్టార్ హీరోలు ఇలాంటి రేర్ ఫిట్ ని సాధిస్తూ ఉంటారు. కానీ యంగ్ హీరోగా పేరు పొందిన తేజ మాత్రం కేవలం అతి తక్కువ సమయంలో ఇలాంటి రేర్ ఫీట్ అందుకోవడం గమనార్హం. దీంతో ఇప్పుడు తేజ సజ్జా పేరు అందరి దృష్టిని ఆకర్షించేలా చేస్తోంది.మిరాయ్ - 2, జై హనుమాన్ వంటి చిత్రాలలో నటిస్తున్నారు. ఇవే కాకుండా మరో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది తేజ సజ్జా ఈ సినిమాలు కూడా చాలా విభిన్నమైన కథాంశంతోనే ఉండబోతున్నట్లు సమాచారం.