తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అర్ధ శతాబ్దానికి పైగా కొనసాగుతున్న తన పొలిటికల్ జర్నీలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నారు. ఆయన లాంగ్ జర్నీ లో సాధించిన పలు రికార్డులు సమీప భవిష్యత్తులో ఎవరూ తాకలేనివిగా నిలిచిపోయాయి. తాజాగా బాబు పొలిటికల్ కెరీర్‌లో మరో విశేష రికార్డు చేరింది. ఇది రాజకీయమయినా కాదు, పూర్తిగా ఆధ్యాత్మిక పంథాలో సాధించిన రికార్డు కావడం విశేషం. చంద్రబాబు ఎప్పుడూ తాను శ్రీవారి భక్తుడినే అని చెప్పుకొంటూ ఉంటారు. జీవితంలో ఎదురైన ప్రతి పెద్ద నిర్ణయంలోనూ, ప్రతి మలుపులోనూ తిరుమల వేంకటేశ్వర స్వామి ఆశీస్సులే తనకు తోడయ్యాయి అని బహిరంగంగా ప్రకటిస్తుంటారు. ముఖ్యంగా 2003లో అలిపిరి ఘటన నుంచి బయటపడటం తనకు స్వామి కటాక్షమే అని అనేకసార్లు చెప్పారు.

అంతటి భక్తి ప్రపత్తి ఉన్న బాబుకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం వరుసగా దక్కడం అనేది ఎంతో అరుదైన అదృష్టం. 1995లో తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బాబు, ఆ పదవిలో ఉన్న తొమ్మిది ఏళ్లలో ఎనిమిది సార్లు స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం 2014లో విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ సీఎం అయ్యి, మరో ఐదు సార్లు అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. ఇక 2024లో నాలుగోసారి ముఖ్యమంత్రి హోదా చేపట్టిన బాబు, గత ఏడాది, ఈ ఏడాది వరుసగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ద్వారా మొత్తం సంఖ్యను 15కు చేర్చారు. అంటే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయలేని ఘనతను చంద్రబాబు సాధించారు.

ఇంకా ఈ టెర్మ్‌లో కనీసం మూడు సార్లు పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఉండటంతో, మొత్తం 18 సార్లు ఈ రికార్డును సొంతం చేసుకునే అవకాశం బలంగా ఉంది. ప్రస్తుతం ఈ విశేషం రాజకీయ వర్గాలకే కాదు, ఆధ్యాత్మిక వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే, ఇంత సుదీర్ఘమైన రాజకీయ జీవితం, నాలుగు సార్లు ముఖ్యమంత్రి హోదా పొందడం, అంతటి కాలం ప్రజల విశ్వాసాన్ని నిలుపుకోవడం అంటే అతి అరుదైన విషయం. ఇక అంత కాలం వరుసగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం దక్కడం మరింత అరుదైన రికార్డుగా నిలిచిపోయింది. ఇదంతా చూస్తుంటే, చంద్రబాబు రాజకీయ పరంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా రికార్డులు సృష్టిస్తున్నారు అని చెప్పక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: