
సుదీర్ఘ మీటింగ్… కీలక నిర్ణయాలు .. మంగళవారం రాత్రి బాబు - తెలంగాణ టీడీపీ నేతల భేటీ జరిగింది. చాలా కాలం తరువాత చంద్రబాబు తెలంగాణ నేతలతో కూర్చుని స్ట్రాటజీ చర్చించారు. రాష్ట్ర అధ్యక్షుడు, మండల కమిటీలు, డివిజన్ కమిటీలు, స్టేట్ కమిటీ - ఆల్ ఇన్ వన్ చర్చ జరిగింది. మూడు రోజులలోపే 638 మండల కమిటీల నియామకం పూర్తి చేయాలని బాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని సమాచారం. 1.78 లక్షల మంది సభ్యత్వం నమోదు చేసినట్టు తెలంగాణ టీడీపీ నేతలు బాబుకు వివరించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ యాక్టివ్‌గా కదలడానికి రెడీగా ఉన్నామని తెలిపారు. దీన్ని బలంగా మలచుకోవడమే ఇప్పుడు బాబు టార్గెట్. క్రమంగా పార్లమెంట్ కమిటీలు కూడా ఏర్పాటు చేయబోతున్నారని సమాచారం.
సుహాసినికే అదృష్టం? .. అత్యంత హాట్ టాపిక్ – రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికీ? పార్టీలో గుసగుసలు సుహాసినిపైనే ఉన్నాయి. దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని ముందుకు తేవాలని నేతలు సూచిస్తున్నారని తెలుస్తోంది. నందమూరి ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్, పార్టీకి తెలంగాణాలో మళ్లీ గాలి తీసుకురావచ్చని భావిస్తున్నారు. బాబుతో మంగళగిరి మీటింగ్‌లో సుహాసిని హాజరుకావడం కూడా ఈ అంచనాలను మరింత బలపరుస్తోంది. బాబు స్ట్రాటజీ క్లియర్! .. “ముందు కమిటీల నియామకం పూర్తి చేయండి… ఆ తర్వాత శక్తివంతమైన నాయకుడికి రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తాం” అని చంద్రబాబు స్పష్టం చేసినట్టు సమాచారం. ఇక సుహాసినికి అవకాశం ఇచ్చినా పెద్ద షాక్ కాదు. ఎందుకంటే, ఇది ఇమేజ్ కూడా… స్ట్రాటజీ కూడా. తెలంగాణాలో టీడీపీ రీ-ఎంట్రీకి మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. ఏపీలో గెలిచిన వేళే తెలంగాణాలో బలమైన అడుగు వేయాలన్నది బాబు దృష్టి. ఆ మిషన్‌లో సుహాసినికే కీలక పాత్ర దక్కే అవకాశం బలంగానే కనిపిస్తోంది.