ఎన్నికలు వచ్చాయంటే చాలు పార్టీల మధ్య మాటల యుద్ధాలు నడుస్తాయి. ఒక పార్టీని మించి మరో పార్టీ వ్యూహాలపై ప్రతి వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. వీళ్ళందరి పంతం ప్రజల మనసు గెలుచుకోవడమే. ప్రజలు ఎవరి వైపు ఓటు వేస్తే వారి గెలుపు ఖాయం అనేది సత్యం. ఒక్కోసారి ప్రజల కోసం నాయకులు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఓడిపోతారు.కనీసం డబ్బులు ఖర్చు చేయని వ్యక్తులు గెలుస్తూ ఉంటారు. దీన్ని బట్టి చూస్తే ప్రజలకు డబ్బుతో పనిలేదు నాయకుడే ముఖ్యమైనవాడిగా కనబడుతారు. అలాంటి ఈ సమయంలో తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా కీలకంగా మారింది. ఈ గెలుపు అనేది అన్ని పార్టీలకు ఒక బూస్టింగ్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిస్తేనే జనాల్లో కాంగ్రెస్ బలంగా ఉందని నిరూపించుకునే అవకాశం ఉంటుంది.

 ఒకవేళ ఓడిపోతే కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత వస్తుందని అర్థమవుతుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిపక్ష హోదాలో ఉంది. ఇక్కడ గెలిచి ఎలాగైనా నాయకుల్లో,కార్యకర్తల్లో కొత్త ఊపు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇలా వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచిస్తూ ఉన్న సమయంలో బీజేపీ మాత్రం చాలా సైలెంట్ అయిపోయింది. అయితే దీనికి రెండు కారణాలు చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతుందని బిజెపికి ముందే తెలుసు. అయినా ఏ అభ్యర్థిని అలర్ట్ చేయలేదు.కనీసం గ్రౌండ్ వర్క్ కూడా చేయడం లేదు. ఇంచుమించు జూబ్లీహిల్స్ లో 25 వేల ఓట్లకు పైగా బలం ఉంది. అయినా బిజెపి అభ్యర్థిని ప్రకటించకపోవడం వెనుక వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అయితే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కడెక్కడ ఓడిపోయిందో అక్కడ బిజెపి పుంజుకుంటూ వచ్చింది. బీఆర్ఎస్ ఎంపి స్థానాలను బిజెపి కైవసం చేసుకుంది. దీన్నిబట్టి చూస్తే రాబోవు రోజుల్లో కూడా బీఆర్ఎస్, వామపక్ష పార్టీల  స్థానాలను బిజెపి కైవసం చేసుకుంటుందని చెప్పవచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా బిజెపి అభ్యర్థిని ప్రకటించడం లేదని అంటున్నారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోతే ఆ స్థానాన్ని రాబోవు రోజుల్లో బిజెపి కైవసం చేసుకుంటుంది. దీనివల్ల వారి బలం పెరుగుతుందని ఆలోచన చేస్తున్నారు.. ఈ విధంగా బిజెపి పెద్దగా ప్రచారం చేయకుంటే అక్కడ నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ కు మేలు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: