సినీ హీరో ,హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలు మరొకవైపు రాజకీయాలతో దూసుకుపోతున్నారు. నిన్నటి రోజున తన నియోజకవర్గంలో బాలకృష్ణ సమీక్షలు, సమావేశాలు నిర్వహించగా అనంతరం మీడియాతో బాలకృష్ణ మాట్లాడారు. ముఖ్యంగా అక్కడ నిరుద్యోగులకు, అక్కడ ప్రజలకు, ఒక గుడ్ న్యూస్ ని తెలియజేశారు. హిందూపురంలో ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని మాట ఇచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే హిందూపురం ఆసుపత్రి అభివృద్ధి చెందలేదని తెలిపారు బాలయ్య. ముఖ్యంగా డాక్టర్లు, సిబ్బందిని అదనంగా ఏర్పాటు చేసి రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తానంటూ తెలియజేశారు.


అలాగే హిందూపురం హాస్పిటల్లో మరికొన్ని అధునాతన  పరికరాలను ఏర్పాటు చేస్తానని హిందూపురం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కొత్త కొత్త పరిశ్రమలు కూడా తీసుకురాబోతున్నానంటూ తెలియజేశారు. ఏరో స్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్ సిటీ వంటి పరిశ్రమలు కూడా హిందూపురంకి తీసుకురావడానికి సీఎం చంద్రబాబు చాలా కృషి చేశారంటూ తెలియజేశారు. ఈ కొత్త పరిశ్రమలు రావడం వల్ల నిరుద్యోగ యువతి, యువకులకు మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు భూములు కోల్పోయిన రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించిన తరువాతే వీటిని మొదలు పెడతామని, భూములు కోల్పోయిన రైతులు కూడా అధైర్య పడవద్దు, వ్యవసాయ భూమికి సంబంధించి భూమి ఇవ్వడం కానీ లేకపోతే రెట్టింపు డబ్బులతో భూమి మీద కొనుగోలు చేస్తారంటూ తెలియజేశారు.

రాబోయే రోజుల్లో హిందూపురం రూపు రేఖలను మార్చే విధంగా బాలకృష్ణ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. హిందూపురం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతేనే ఇక్కడ ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయంటూ తెలియజేశారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దడంతో పాటుగా ,పరిశ్రమలు రావడంతో హిందూపురం ప్రగతి బాటలో పడుతుందంటూ బాలకృష్ణ చేసిన ఈ ప్రకటనలు అటు హిందూపురం వాసులను మాత్రం ఆనందాన్ని కలిగించేలా చేస్తున్నాయి. మరి పనులను ఎప్పుడు మొదలుపెడతారు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: