
భారతదేశం అంటేనే సర్వమత సమ్మేళనం.. ఇక్కడ ఎంత టెక్నాలజీ పెరిగినా దేవుళ్లను పూజించడం దేవుళ్లపై నమ్మకం పెట్టుకోవడం మాత్రం అస్సలు మానరు.. ఈ సాంప్రదాయం ఇప్పుడు వచ్చింది కాదు పూర్వకాలం నుంచే మనం పాటిస్తూ వస్తున్నాం. ముఖ్యంగా మన ఇండియాలో దేవుళ్ళ పేరుతో చేసే పండుగలు ఇంకా ఏ దేశంలో చేయరని చెప్పవచ్చు. అలాంటి భారతదేశంలో తెలంగాణలో దేవుళ్ళకి ఇంకా ప్రత్యేకత ఉంటుంది. చెట్టు, పుట్ట, రాయి రప్ప ఇలా అన్నింటిని దేవుళ్ళుగా కొలుస్తారు. ప్రజలు కూడా దేవుళ్లను అత్యంత ప్రీతిపాత్రంగా నమ్ముతారు.. అలాంటి దేవుళ్ళ గుళ్లపై ఏదైనా దాడులు జరిగితే మాత్రం అస్సలు సహించరు.. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది జనాలు మారిపోయారు. దేవుడి గుళ్ళల్లో హుండీలు దొంగతనాలు చేయడం,విగ్రహాలు ధ్వంసం చేయడం వంటివి చేస్తున్నారు.