 
                                
                                
                                
                            
                        
                        ఇక తనకు ఉన్న పంచాయతీ రాజ్ శాఖ బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తించేందుకు ప్రయత్నించారు. తుపాను కారణంగా ప్రాణనష్టం జరగకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని పవన్ స్వయంగా సూచనలు ఇచ్చారు. ఇదే సమయంలో ఆయన ప్రజల్లోకి వెళ్లకపోవడం గురించి కొన్ని వర్గాలు ప్రశ్నించాయి. కానీ పవన్ కల్యాణ్ విషయానికొస్తే ఇది కొత్త విషయం కాదు. ఆయనకు తన అభిమానుల పట్ల ఉన్న ప్రేమే కారణం. ఎక్కడికైనా వెళ్లినా అభిమానులు చుట్టుముడుతారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజా పర్యటనలు ప్రమాదకరంగా మారవచ్చని ఆయనకు తెలుసు.
తమిళనాడులో విజయ్ పాల్గొన్న సభలో జరిగిన తొక్కిసలాట ఆయనకు ఉదాహరణగా ఉంది. అందుకే పవన్ ఎప్పుడూ “జనం సేఫ్టీ ముందు” అని భావిస్తారు. తుపాను సమయంలో ఆయన ప్రజల్లోకి రాకపోయినా, తన స్థాయి నుంచి అధికార యంత్రాంగాన్ని చురుకుగా నడిపించారు. విపత్తు సమయంలో ప్రజలు సురక్షితంగా ఉండేలా చూసుకున్నారు. చివరికి తుపాను పెద్ద నష్టం లేకుండా దాటిపోవడంతో పవన్ కల్యాణ్ ఊపిరి పీల్చుకున్నారు. పవన్ కల్యాణ్‌కు ప్రచారం అవసరం లేదు. ఆయనకు కావలసింది ఫలితం. ప్రజల భద్రత, అధికార వ్యవస్థ సమర్థత ఆయనకు ముఖ్యం. అందుకే ఆయన శైలి కొంచెం భిన్నంగా ఉంటుంది. కానీ ఆ భిన్నతే ఆయనను ప్రత్యేకంగా నిలబెడుతుంది.
 
             
                             
                                     
                                             క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి
 క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి