- ( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ ) . . .

శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గం లోని కాశీబుగ్గలో శనివారం తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసులట జరిగింది. ఈ ఘటనలలో 9 మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా వస్తూ ఉంటారు. అందులో శనివారం ఏకాదశి కావడం ... కార్తీకమాసం కావడంతో భక్తులు భారీగా పోటీఎత్తారు. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట చోటు చేసుకుంది. పలువురు భక్తులు స్పృహతప్పి పడిపోయారు. ఘటన స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రమాదంలో ఏడుగురు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో ఇద్దరు భక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. సుమారు 20 మందికి పైగా గాయపడినట్టు సమాచారం.


శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కలాట ఘటన తనను తీవ్రంగా కలిసి వేస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం అని ... మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని ... గాయాలపాలైన వారికి వెంటనే చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను... ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులను ప్రజాప్రతినిధులను కోరాను అని చంద్రబాబు తెలిపారు. ఆలయ తొక్కిసలాట ఘటనపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు తక్షణ మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ఇతర అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.


రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు సంఘటన స్థలానికి చేరుకునే పరిస్థితిని సమీక్షించారు. ఇక ఈ ఆలయం ప్రత్యేకత విషయానికి వస్తే నాలుగేళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణాన్ని ధర్మకర్త హరి ముకుంద్ పాండే ప్రారంభించారు. 12 ఎకరాల సొంత భూమిలో ఈ ఆలయ నిర్మాణం అద్భుతంగా జరిగింది. సుమారు 20 కోట్లతో దీనిని నిర్మించారు. కొత్తగా నిర్మించిన ఆలయంలో మే నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రతి శనివారం ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: