సాధారణంగా క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా టీవీల ముందు కూర్చుని మ్యాచ్ వీక్షించడం కంటే.. అటు స్టేడియం లోకి వెళ్లి ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే  కరోనా వైరస్ కారణంగా ప్రేక్షకులకు మాత్రం ఎప్పుడూ నిరాశే ఎదురవుతుంది. ప్రేక్షకులను అనుమతించకుండా అన్ని రకాల మ్యాచ్ లు కూడా జరగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో కరోనా వైరస్ ప్రభావం ఎప్పుడు తగ్గుతుందా ఇక స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఎప్పుడు వస్తుందా అని వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.


 అయితే సాదాసీదా మ్యాచ్ వస్తుంటే కళ్లార్పకుండా చూసే ప్రేక్షకులు అసలు సిసలైన క్రికెట్ ఎంటర్ టైన్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్ అయిన ఐపీఎల్ టోర్నీ వస్తుందంటే మరింత ఆతృతగా ప్రత్యక్షంగా వీక్షించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ కు ప్రేక్షకులను స్టేడియానికి అనుమతిస్తారా లేదా అని ఎంతోమంది ఆతృతగా ఎదురు చూశారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని కేవలం 25 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఈ క్రమంలోనే కొంత మంది ప్రేక్షకులు సంతోషపడి పోతే మరి కొంతమంది మాత్రం కాస్త ఎక్కువ మంది ప్రేక్షకులను అనుమతిస్తే వీళ్ళ సొమ్మేం పోతుందో అంటూ తిట్టుకున్నారు కూడా.



 ఇటీవలే ఐపీఎల్ అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసే విధంగా బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుని అందరికీ శుభ వార్త చెప్పింది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఐపీఎల్ మ్యాచ్లు జరిగే అన్ని స్టేడియం లలో  కూడా 50 శాతం కెపాసిటీ తో ప్రేక్షకులను అనుమతించ పోతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఏప్రిల్ 6వ తేదీన కోల్కతా నైట్రైడర్స్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ మ్యాచ్ లో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు అమలు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక శనివారం నుంచి మహారాష్ట్ర కరోనా నిబంధనలు ఎత్తి వేస్తున్న తరుణంలో బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకుంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: