ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచ కప్ సంచలనాలు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో ఛాంపియన్ జట్లుగా కొనసాగుతున్న జట్లు పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తూ ఉన్న సమయంలో ఇక అటు పసికూనగా పిలవబడే జట్లు మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేసి అదరగొడుతూ ఉన్నాయి. ఏకంగా చాంపియన్ జట్లకు షాక్ ఇస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న ఇంగ్లాండ్ పై ఐర్లాండ్ విజయం సాధించి సంచలనం సృష్టిస్తే.. ఆ తర్వాత పాకిస్థాన్ పై జింబాబ్వే విజయం సాధించి సత్తా చాటింది.


 ఇక ఇప్పుడు వరల్డ్ కప్ లోనే పటిష్టమైన జట్టుగా కొనసాగుతున్న ఛాంపియన్ దిగ్గజ జట్టు సౌత్ ఆఫ్రికా ను పసికూన నెదర్లాండ్ జట్టు ఓడించింది. సెమీఫైనల్కు అర్హత సాధించాలి అంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఇటీవల సౌత్ ఆఫ్రికాకు చేదు అనుభవం ఎదురయింది అని చెప్పాలి. ఇక ఇటీవలే నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్  జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే ఒక మోస్తారు లక్ష్యంతో బరిలోకి దిగింది సౌత్ ఆఫ్రికా జట్టు. అయితే ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా ఎంతో పటిష్టంగా ఉండడంతో ఈ టార్గెట్ ను చేదించడం పెద్ద కష్టమేమీ కాదు అనుకున్నారు అందరూ.


 అది కూడా నెదర్లాండ్స్ లాంటి పసికూన జట్టు బౌలర్లను సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు  ఉతికి ఆరేయడం ఖాయం అని ఎంతో మంది భావించారు. అయితే స్వల్ప లక్ష్య చేదనతో చేతనతో బరిలోకి దిగినప్పటికీ సౌత్ ఆఫ్రికా జట్టు మాత్రం అనూహ్యంగా నెదర్లాండ్స్ బౌలర్ల ఉచ్చులో చిక్కుకొని ఘోర ఓటమి చవిచూసింది. దీంతో క్రికెట్ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది సౌత్ ఆఫ్రికా. తద్వారా ఓటమి తప్పలేదు. అయితే ఇలా టి20 వరల్డ్ కప్ లో భాగంగా సౌత్ ఆఫ్రికా జట్టు ఏకంగా నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోవడం ప్రస్తుతం అందరిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc