బిసిసిఏ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అన్న విషయం తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది అంటే చాలు కేవలం భారత క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఇక ఈ లీగ్ మ్యాచ్లను చసేందుకు ఎంతగానో ఆసక్తి చూపుతూ ఉంటారు. ఎందుకంటే ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లందరూ కూడా అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగం అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ లో ప్రత్యర్ధులుగా పోరాడిన వారు ఐపీఎల్లో మాత్రం సహచరులుగా మారిపోయి ఒక జట్టుగా విజయం కోసం పోరాటం చేయడం ఎంతో మంది దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది.


 అదే సమయంలో ఇక సహచర ఆటగాళ్లు ఐపీఎల్లో ప్రత్యర్ధులుగా మారిపోయి క్రికెట్ ఆడటం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం అయింది అంటే చాలు అటు ప్రేక్షకులు నేరుగా మైదానంలోకి వెళ్లి మ్యాచ్ చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. కొంతమంది ఇక టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు. అయితేఇక ఈ ఏడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. ఛాంపియన్ జట్లు అన్ని లీగ్ దశ నుంచే వెనుదిరగగా  ఐపీఎల్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన  గుజరాత్ టైటాన్స్ జట్టు ఇక కొత్త ఛాంపియన్గా అవతరించింది అని చెప్పాలి.


 కాగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో జరగగా. ఏకంగా 1,01,566 మంది ప్రేక్షకులు ఈ మ్యాచ్కి హాజరయ్యారు. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్ గిన్నిస్ బుక్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ స్టేడియంలో మొత్తం 1,10,000 మంది కూర్చోవడానికి వీలు ఉంది అని చెప్పాలి. ఇలా ఎక్కువ మంది క్రికెట్ ప్రేక్షకులు హాజరైన ఫైనల్ మ్యాచ్ కు ఆతిథ్యం వహించిన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించింది అని చెప్పాలి. అయితే ఇలా గిన్నిస్ బుక్ రికార్డు సాధించడం పై ఎంతో ఆనందం వ్యక్తం చేశారు బీసీసీఐ అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: