మొత్తానికి జనసేన పార్టీ పెద్ద త్యాగానికి దిగిపోయింది. గ్రేటర్ లో ఒంటరిగా సత్తా చాటుతామని గంభీరంగా ప్రకటించడంతో పాటు,  కొంత మంది అభ్యర్థులతో నామినేషన్లు సైతం వేయించింది. ఇంకేముంది అటు బీజేపీ, ఇటు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు దీటుగా. జనసేన జెండా గ్రేటర్ లో ఎగిరిపోతుంది అని అంతా బోలెడు ఆశలు పెట్టుకోగా, చివరకు తుస్సు తుస్సు కనిపించారు. తమతో పొత్తు పెట్టుకున్న బీజేపీ అక్కడ పోటీ చేస్తున్నా, అసలు ఏ మాత్రం వారిని లెక్కచేయకుండా, అసలు వారితో తమకు పని లేదు అన్నట్టుగా వ్యవహరించి మరీ పోటీకి దిగగా, ఏమయ్యా పవన్ అసలు మాతో ఏపీ లో పొత్తు పెట్టుకుని, చివరకు మళ్లీ ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తాను అంటావా ?  అసలు ఇది న్యాయమా ధర్మమా అంటూ రిక్వెస్ట్ తో కూడిన బెదిరింపు చేసేసరికి ,ఎందుకు వచ్చిన తంటాలే అనుకుంటూ గ్రేటర్ లో దుకాణం మూసేసారు. 



అప్పటివరకు బిజెపి పై దండయాత్ర అంటూ హడావుడి చేసి,  చివరకు ఆ పార్టీకి అర్జెంటుగా సైనికులందరూ మద్దతు ఇచ్చి గెలిపించాలని ఒక ప్రకటన చేశారు. దీంతో అసలు మా పవన్ కళ్యాణ్ ఎంత మంచి వా డో అంటూ బీజేపీ నేతలు 4 పొగడ్తలు పొగిడేశారు. ఆ సీన్ అక్కడితో కట్ చేస్తే , పవన్ ఇప్పుడు ఢిల్లీలో తేలారు. కేంద్ర బిజెపి అందరిని కలిసి గ్రేటర్ లో మేం చేసిన త్యాగం గుర్తించి ఏపీలోని తిరుపతిలో మాకు పోటీ చేసే అవకాశం ఇవ్వండి మహా ప్రభో అంటూ వినతి తో కూడిన డిమాండ్ చేసేందుకు మనోహరుడితో పవన్ డిల్లీ లో చక్కర్లు కొడుతున్నారు.



 తిరుపతి టికెట్ జనసేనకి అనే హామీ ఇచ్చే వరకు తాను ఊరుకునేది లేదు అంటూ పవన్ కొత్త షరతులు ఎన్నో విధిస్తూ , ప్రస్తుతం హడావుడి చేస్తున్నారట. ఒకవేళ ససేమిరా అంటూ బీజేపీ నాయకులు మొండికేస్తే, తాట తీస్తా అని సినిమా డైలాగులు సైతం పలికేందుకు కూడా పవన్ సిద్దం అయ్యే ఢిల్లీకి వెళ్లారు అంటూ ఇక్కడ సైనికులు హడావుడి చేసేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: