మాయావ‌తి మంచి లీడ‌రా?
చిక్కు ప్ర‌శ్న‌లు అడిగి యుద్ధాలు చేయ‌మాకండి
అని చ‌దువు చెప్పిన ప్రొఫెస‌రు ఒక‌రు అన్నారు
న‌వ్వుకున్నాను
అగ్ర‌వ‌ర్ణ పేద‌లు అంటే ఆమెకు ఇష్ట‌మా





ఎవ్వ‌రికైనా పేద‌లంటే ఇష్ట‌మే
శ్రీ‌శ్రీ మొద‌లుకొని ప్ర‌వీణ్ వ‌ర‌కూ అంద‌రికీ పేద‌లంటే ఇష్ట‌మే
వాళ్లు వీళ్ల‌ను ఇష్ట‌ప‌డుతున్నారా లేదా అన్న‌ది ముఖ్యం అంటూ
న‌వ్వారు కొంద‌రు.. అవును! పేద‌లు వాన‌లు ఒక్క‌టే
అవి ఒక‌చోట నిల‌బ‌డ‌వు.. నిల‌బ‌డ‌నీయ‌వు..
అగ్ర‌వ‌ర్ణ (బ్రాహ్మ‌ణులు) కులాలు లేదా సంబంధిత వ‌ర్గాల‌ను
ద‌ళితుల‌తో క‌లిపే ప్ర‌య‌త్నంలో ఏనుగు ఇంటికి ముందుకు వ‌చ్చింది





ఉత్తరాది రాజ‌కీయంలో బీఎస్పీ అర్థం కాక‌పోయినా తెలుగు రాష్ట్రాలు మాత్రం మాయావ‌తిని న‌వ్వులను అంత వేగంగా స్వీక‌రించ వు. ఆ మాట‌కు వ‌స్తే మాయావ‌తి న‌వ్వు చంద్ర‌బాబు న‌వ్వు కేసీఆర్ నవ్వు జ‌గ‌న్ న‌వ్వు ఇలాంటి వేర్వేరు న‌వ్వుల ద‌గ్గ‌ర పేద‌లు అన‌గా అత్యంత ద‌య‌నీయ స్థితిలో ఉన్నవారు ఎన్న‌డూ ఏదో ఒక‌టి ఆశిస్తూనే ఉన్నారు త‌ప్ప‌! స్వ‌శ‌క్తి , స్వావలంబ‌న అనే ప‌దా లు వారికి చేరువ కావ‌డం లేదు. ఆ విధంగా తెలుగు రాష్ట్రాల‌కు బీఎస్పీ చేరువ కాకున్నా చేరువ అయ్యేందుకు చేసే ప్ర‌య‌త్న‌మే గొప్ప.





తెలుగు రాష్ట్రాల‌ను ప్ర‌భావితం చేసే రాజ‌కీయాల‌ను బీఎస్పీ చేయాల‌నుకుంటుంది. ఏనుగెక్కి ఊరేగ‌డంలో ఆనందం ఉంది. కానీ న‌డిపేవాడే కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి. తెలుగు రాష్ట్రాల‌కు ఆ ప్రాబ్లం ఉంది. ఉత్త‌రాది శ‌క్తుల‌కు అంత వేగం బ‌లం ఇవ్వ‌వు. బ‌లం ఇవ్వ‌క‌పోతే తెచ్చుకుంటాను అని అంటారు మాయావ‌తి. అలాంటి ఇలాంటి బ‌లం కాదు నాకంటూ ఓ శ‌క్తి ఉంది.. నా దారి ర‌హ‌దారి అని కూడా ఆమె అన‌గ‌ల‌రు. గ‌తంలో కొన్ని రాజ‌కీయ శ‌క్తుల మాదిరిగానే మాయావ‌తి ఇటుగా వ‌స్తున్నారు. లేదా వచ్చేందుకే దారి వెతుక్కుం టున్నారు. మాయ‌వ‌తికి ఇక్క‌డ ప్ర‌వీణ్ అనే ప్ర‌తినిధి ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న బ‌లం ఏపాటిది? బ‌లం బ‌ల‌గం రెండూ ఉన్న కేసీఆర్ న‌వ్వుతాడు. ఏనుగును చూసి న‌వ్వుతాడు. ప్ర‌వీణ్ ను చూసి కూడా న‌వ్వే విసిరి ఊరుకుంటాడు. ఇంటి పార్టీ దూలాలు అప్పుడే ప‌డిపోవు అని ఆయ‌న ఫీలింగ్. అవినీతి చెద‌ల బాగోతం వెలుగులోకి రానంత వ‌ర‌కూ మాయావ‌తిలానే కేసీఆర్ కూడా సేఫ్.


మరింత సమాచారం తెలుసుకోండి:

bsp