సినిమాపై ప్రేమతో ఎంతో మంది నటీనటులు ఇండస్ట్రీకి వస్తుంటారు. కానీ అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతుంటారు. చాలా మంది సరైన అవకాశాలు రాక వచ్చినా నిలబెట్టుకోలేక కింది స్థాయిలోనే ఉండి పోతారు. కానీ ఒక నటుడిగా స్థిరపడడం అనేది సామాన్యమైన విషయం కాదు. దాని వెనుక ఎంతో కృషి, కష్టం, పట్టుదల దాగి ఉంటాయి.
టాలీవుడ్ లో కమెడియన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన ఆహుతి ప్రసాద్ గురించి తెలిసి ఉంటుంది. కానీ అతని పేరు మాత్రం పెద్దగా తెలియదు. కొందరు పేర్లు తెలియకపోయినా సరే ఎంతో అభిమానిస్తూ ఉంటారు ప్రేక్షకులు. జనవరి 2 న 1958  ముదినేపల్లి లో జన్మించారు అడుసుమిల్లి జనార్ధన ప్రసాద్. ఈయన చిన్నప్పుడు 9 వ తరగతి చదువుతున్నప్పుడు స్కూల్ లో వేసిన అన్నాచెల్లెళ్లు అనే నాటకంలో పాత్రకు బహుమతి వచ్చింది.

అప్పుడే అనుకున్నాడు నటుడిగా మారాలని బలంగా అనుకున్నాడు. అలా హైదరాబాద్ లోని మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరాడు. అనుకోకుండా ఈ ఇన్స్టిట్యూట్ బాధ్యతలు తన చేతికి వచ్చాయి. ఆ తర్వాత ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ఆ తర్వాత మొదటి సారిగా మధు ఇన్స్టిట్యూట్ వారు నిర్మించిన విక్రమ్ సినిమాలో నటించాడు. అలా మొదలైన ఇతని సినిమా ప్రస్థానం 1987 వ సంవత్సరంలో శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మాతగా చేసిన ఆహుతి సినిమాలో శంబు ప్రసాద్ అనే  విలన్ పాత్రకు మంచి పేరు వచ్చింది. సినిమా కూడా ఘానా విజయాన్ని సాధించింది. ఆనాటి అంద్రప్రభ జర్నలిస్ట్ ఆంజనేయ శాస్త్రి ఆహుతి సినిమా గురించి రాస్తూ ఇందులో శంభు ప్రసాద్ పాత్రలో నటించిన జనార్ధన్ ప్రసాద్ పేరును కాస్తా ఆహుతి ప్రసాద్ చాలా బాగా చేశారు అని రాశారు అని రాశారు.

ఆ పత్రికను చదివిన వారంతా ఆయనను ఆహుతి ప్రసాద్ గానే అనుకున్నారు. ఆ విధంగా జనార్ధన ప్రసాద్ పేరు కాస్తా ఆహుతి ప్రసాద్ గా మారిపోయింది. ఆ తర్వాత మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నారు. మొత్తానికి తన సినీ కెరీర్లో 300 చిత్రాలలో నటించి ప్రేక్షకుల మనసులో ఈ నాటికీ ఆహుతి ప్రసాద్ గా గుర్తుండిపోయారు.  ఆహుతి ప్రసాద్  జనవరి 4 న 2015 క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ పరమపదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: