
కొరియోగ్రఫీ అనగానే ముందుగా మనకు శివ శంకర్ మాస్టర్ గుర్తొస్తారు. ఆయన సినీ ఇండస్ట్రీలో నృత్య కొరియోగ్రాఫర్ గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా స్త్రీ లింగం గా కొరియోగ్రఫీ చేయడం ఆయనకు మాత్రమే సాధ్యం అని చెప్పవచ్చు. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన శివ శంకర్ మాస్టర్.. దాదాపుగా టెలివిజన్ పై ప్రసారమయ్యే కొన్ని షోలకు జడ్జ్ గా కూడా వ్యవహరించారు. ముఖ్యంగా ఆట వంటి డాన్స్ ప్రోగ్రాం లకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన శివ శంకర్ మాస్టర్ .. బుల్లితెర ఇండస్ట్రీకి ఓంకార్ లాంటి ప్రముఖ యాంకర్ ను పరిచయం చేశారు. ఇక ఓంకార్ కూడా బుల్లి తెరపై మంచి ఇమేజ్ వచ్చిన విషయం తెలిసిందే.
ఇకపోతే శివ శంకర్ మాస్టర్ ఎప్పటినుంచి స్త్రీ లింగం గా తన శరీరాకృతిని మార్చుకొని సినిమాలలో కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నారు అనే విషయానికి వస్తే.. ముఖ్యంగా తమిళ దర్శకుడు అయినటువంటి కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన వారలారు (2006) అనే సినిమాలో అజిత్ కుమార్ నృత్య శిక్షకుడిగా నటించాడు .. ఇక ఈ సినిమాలో డ్యాన్స్ సీక్వెన్స్‌లు కాకుండా యాక్షన్ సీక్వెన్స్‌లు అలాగే అజిత్ బాడీ లాంగ్వేజ్‌ని స్త్రీలింగంగా చిత్రీకరించమని కొరియోగ్రాఫర్‌ని అడిగారట దర్శకుడు కె.ఎస్ రవికుమార్. మొదటిసారి అజిత్ సినిమా కోసం ఆయన స్త్రీలింగం గా కొరియోగ్రాఫర్ గా పనిచేశారు.
దాదాపు ఎనిమిది వందల చిత్రాలకుపైగా కొరియోగ్రాఫర్ గా పనిచేసిన శివ శంకర్ మాస్టర్ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా తమిళనాడు రాష్ట్రం నుండి స్టేట్ ఫిలిం అవార్డుతో పాటు నేషనల్ ఫిల్మ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. తెలుగులో ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన శివ శంకర్ మాస్టర్ .. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాలో ధీర ధీర అనే పాటకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఆయనకు .. జాతీయ అవార్డు లభించడం విశేషం. ఇకపోతే కరోనా సోకి నవంబర్ 28 2021 వ తేదీ నాడు ఆయన స్వర్గస్తులయ్యారు.