మేడారం.. దక్షిణ భారతంలోనే అతి పెద్ద గిరిజన జాతర. లక్షల మంది భక్తులు సందర్శించుకునే ఆధ్యాత్మిక స్థలం. రెండేళ్లకోసారి వచ్చి అతి పెద్ద జాతర. ఈ జాతరకు వెళ్లే భక్తులకు తెలంగాణ సర్కారు ఓ గుడ్ న్యూస్ చెబుతోంది. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ప్రత్యేక ప్యాకేజీ కల్పిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రకటించారు.

 

మేడారం వచ్చే పర్యాటకులకు ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేసి అమ్మల దర్శనంతో పాటు ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ఆ ప్యాకేజీ వివరాలు త‌్వరలో వెల్లడిస్తారు. మేడారంలో చేపడుతున్న పనుల పురోగతిపై హరిత హోటల్‌లో అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. మేడారం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.

 

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి శ్రీనివాస్‌ గౌడ్‌ మేడారంలోని సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. జంపన్నవాగు, చిలకలగుట్ట వద్ద జరుగుతున్న పనులను మంత్రులు పరిశీలించారు. మేడారం జాతరను ప్లాస్లిక్‌ రహితంగా నిర్వహించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకున్నట్లు మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: