హిందువులు సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు. మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు చాలా భిన్నం. నిత్యం పూజలు, వ్రతాలు, నోములు చేస్తూ ఆ దేవుడ్ని ఆరాధిస్తుంటారు. హిందువులకు దేవుళ్లంటే చాలా విశ్వాసం. ఇక పండుగలు వస్తే చాలు ఇల్లంతా శుభ్రపరుచుకొని పూజ గదిని ప్రత్యేకించి అలంకరించి...వివిధ రకాల నైవేద్యాలతో ఎంతో గొప్పగా పూజలు జరుపుతుంటారు. హిందువులు ప్రతి ముఖ్యమైన పూజ సమయంలో ఆ దేవుళ్ళకు కొబ్బరికాయ సమర్పిస్తుంటారు. మన సంప్రదాయాలలో కొబ్బరికాయకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. 

పూజ అయిన అనంతరం కొబ్బరికాయను పగలకొట్టి ఆ దేవుని ముందు ఉంచుతాము. ఇలా కొబ్బరికాయను కొట్టి దేవునికి సంమర్పించడాన్ని ఆత్మసమర్పణంతో సమానంగా భావిస్తారు. ప్రతి శుభకార్యాయంలోనూ కొబ్బరికాయకు ప్రాధాన్యం ఇస్తారు. కలశంపై కూడా కొబ్బరికాయను ఉంచుతాము. అది ఎందుకు దాని వెనకున్న ఆంతర్యం ఏమిటో ఇపుడు తెలుసుకుందాం. ప్రత్యేక పూజలు చేసేటప్పుడు, వ్రతాలు, నోములు చేసే సమయంలో కలశాన్ని పెట్టడం మన సాంప్రదాయం. మన వంశం వృద్ధి చెందడానికి ప్రత్యేక పూజ సమయంలో కలశాన్ని ఉంచుతారు. ఇది మనకు సర్వ శుభాలను అలాగే పూజ యొక్క ఫలాన్ని పూర్తిగా అందిస్తుందని వేదపండితులు చెబుతున్నారు. 

ఇక కలశంపై కొబ్బరికాయను ఎందుకు ప్రతిష్టిస్తారు అన్న విషయానికి వస్తే ఈ విశ్వం మొత్తానికి కొబ్బరికాయ మరో రూపంగా చెప్పబడింది. సకల దేవతలు ఉన్న ఈ బ్రహ్మాండానికి మరో  ప్రతీక అయిన కొబ్బరికాయను ఆ దేవుళ్ళ యొక్క అంశను కలిగి ఉంటుందని విశ్వసిస్తూ కలశంపై ప్రతిష్టించడం జరుగుతుంది. ఇక కలశంపై పెట్టిన కొబ్బరికాయను పూజ అనంతరం బ్రాహ్మణులకు ఇవ్వాలి. ఒకవేళ బ్రాహ్మణులకు ఇవ్వలేని పక్షంలో పారే నీళ్లలో ఆ కొబ్బరికాయను నిమజ్జనం చేయాలి. ఇలా బ్రాహ్మణులకు పూజలో కలశంపై ప్రతిష్టించిన కొబ్బరికాయ ఇవ్వడం ద్వారా ఎంతో పుణ్యం దక్కుతుందట. అంతేకానీ ఆ కొబ్బరి కాయను పూజ అనంతరం అలా వదిలేయకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: