జీవితంలో అందరికీ సుకంగా సంతోషంగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. కానీ అందరికీ ఇది సాధ్యం కాదు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వారికి మాత్రమే ఇది సాధ్యం. శ్రీ మహాలక్ష్మీ ఇంట్లో కొలువై ఉంటే మన ఇల్లు భోగ భాగ్యాలతో కళకళలాడుతుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగి సిరి సంపదలతో వెలిగిపోతుంటారు. అయితే ఆ శ్రీ మహాలక్ష్మి ని ప్రసన్నం చేసుకోవడం ఎలా అని అందరూ వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. ఎలాగైనా అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని తపన పడుతుంటారు. సంపదలకు మూలమైన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుని అనుగ్రహం పొందితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని  విశ్వసిస్తారు. అయితే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కుబేరుని విగ్రహాన్ని ఇంట్లో ఉంచాలట. ఈ విశ్వంలోని అన్ని సంపదలు కుబేరుని అధీనంలో ఉంటాయి. 

అయితే కొన్ని నియమాలు పాటించడం ద్వారా కుబేరుని అనుగ్రహం పొందవచ్చు. తద్వారా ఆ శ్రీ మహాలక్ష్మి సంతోషించి  మనల్ని కరుణిస్తుంది. కుబేరుని విగ్రహం ఉంచే ప్రదేశం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. నిద్ర నుండి లేచిన వెంటనే ఉత్తర దిశ వైపు చూడడం చేత మీకు కుబేరుని అనుగ్రహాన్ని పొంది మీకు ధనలక్ష్మి ఆగమనం జరిగి తీరుతుంది అంటున్నారు పండిత మహనీయులు.  ఉత్తర దిశ ధన స్థానంగా చెప్పబడుతోంది. ఉత్తర దిక్కున కుబేరుని విగ్రహం ఉంచాలి. అదే విధంగా కుబేరునికి ప్రీతి కరమైన పచ్చ కుంకుమతో  పూజించడం వలన కుబేరుని ఆశీస్సులు పొందగలరు.

ఈ పచ్చ కుంకుమ ఐశ్వర్యానికి చిహ్నంగా చెప్పబడుతోంది. ఇలా పచ్చ కుంకుమతో  కుబేరుని పూజించడం వలన కుబేరుని అనుగ్రహంతో పాటు ధనలక్ష్మి ని ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ పచ్చ కుంకుమను కుబేరుని కుంకుమని కూడా పిలుస్తారు. ఇలా నిత్యం పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. పై విధంగా మీరు పాటిస్తే కుబేరుడు మరియు లక్ష్మి దేవి మీ ఇంట్లో ఉండి, మీరు సుఖ సంతోషాలతో జీవించేలా దీవిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: