"క్రికెటర్లు సింగిల్స్ తిరస్కరించే రోజులు ఎంతో దూరంలో లేవు, ఇప్పుడంతా బౌండరీలదే పెత్తనం. బేస్ బాల్ లాగే క్రికెట్ కు కూడా గణాంకాలు ఆధారం. కానీ గత పదిహేనేళ్లలో ఆటగాళ్ల సగటు విషయాలను పోల్చి చూడడాన్ని దాటి మనం ముందుకెళ్లాం. ప్రస్తుతం వ్యూహరచన, ఆటగాళ్ల ఎంపికలో కూడా డాటా ఉపయోగపడుతోంది. ఆటగాళ్లు మ్యాచ్ లలో సింగిల్స్ ను తిరస్కరించే రోజులు త్వరలోనే వస్తాయి, ఎందుకంటే ప్రతి రెండు లేదా మూడు బంతులకు ఒక సిక్సర్ బాదే పరిస్థితులు వచ్చేశాయి. కేవలం ఫోర్లు, సిక్సర్లు కొట్టడం కోసమే కాకుండా క్రికెట్లో బంతికి, బ్యాట్ కు సరైన పోటీ ఉండేలా చూడాలి " అని అన్నారు ద్రవిడ్. సమాచారం, విశ్లేషణ - క్రికెట్ లో విప్లవాత్మక మార్పులు అనే అంశంపై మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నిర్వహించిన వర్చువల్ సదస్సులో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
క్రికెట్ లో ఫోర్లు, సిక్సర్లు గతంలో అరుదుగా ఉండేవి. ఓవర్ లో ఒకటీ అరా బౌండరీలు ఉంటే అదే గొప్ప. అయితే ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లు వచ్చిన తర్వాత ఓవర్లో సింగిల్స్ కనిపించడంలేదు. ఒకటీ అరా డాట్ బాల్స్, మిగతావన్నీ బౌండరీలు. బ్యాట్స్ మెన్ కూడా సింగిల్స్ తీసి తమ ఎనర్జీని వృథా చేసుకోవాలని అనుకోవడంలేదు. ఒకబాల్ డిఫెన్స్ ఆడి రెస్ట్ తీసుకున్నా.. కసికొద్దీ రెండో బాల్ బౌండరీ దాటించేస్తున్నారు. సహజంగానే బ్యాట్స్ మెన్ కి సింగిల్స్ తీయడంలో బద్ధకం వచ్చేస్తోంది. ఇదే కొనసాగితే.. ఇకపై సింగిల్ తీసే ఛాన్స్ ఉన్నా కూడా ఎవరూ ముందుకు రారని అంటున్నారు ద్రవిడ్. కేవలం బౌండరీలపైనే ఆధారపడతారని చెబుతున్నారు.
ఈ విధానంలో మార్పు వచ్చేందుకు బౌండరీ దూరం పెంచాలని, లెగ్ బై లు లేకుండా చేయాలంటూ.. కొన్ని సూచనలు చేశారు గవాస్కర్. అయితే అంతర్జాతీయ క్రికెట్ లో వీరు ఆశించిన మార్పులు ఇప్పుడప్పుడే వస్తాయా లేదా అనేది అనుమానం. ఇప్పుడు కాకపోయినా.. త్వరలోనే క్రికెట్ నిబంధనలు మాత్రం మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి