కరోనా వైరస్ కారణంగా క్రీడారంగం మొత్తం మొన్నటివరకు సంక్షోభంలో కూరుకుపోయింది.  అయితే పరిస్థితులు సద్దుమణిగిన తరువాత అన్ని రకాల క్రీడలను ప్రారంభించాలని అనుకున్నారు. కానీ ఒక దశ కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయి అనుకునేలోపే రెండవ దశ కరోనా వైరస్ కేసులు తీవ్రస్థాయిలో విజృంభించాయి.  అదే సమయంలో అటు శాస్త్రవేత్తలు కూడా కరోనా వైరస్ పూర్తిగా తగ్గిపోదని అందరి జీవితంలో ఒక భాగం గా మారిపోతుంది అని చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇక కఠిన నిబంధనల మధ్య అన్ని రకాల క్రీడలను ప్రారంభిస్తున్నారు.  ఈ క్రమంలోనే క్రికెట్ మ్యాచ్ లు కూడా ప్రారంభమయ్యాయి.



 కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని  క్రికెట్ ఆటగాళ్ల  బయో బబుల్ పద్ధతిలో క్వారంటైన్  లో ఉంచుతూ కఠిన నిబంధనల మధ్య మ్యాచ్ నిర్వహిస్తున్నాయి అన్ని దేశాల క్రికెట్ బోర్డులు.  ఇక ఇలా బాహ్య ప్రపంచానికి దూరంగా క్రికెట్ ఆటగాళ్లు కేవలం హోటల్ గదికి మాత్రమే పరిమితం అయ్యి క్వారంటైన్ లో ఉంటూ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. కానీ కొన్ని కొన్ని సార్లు క్రికెట్ ఆటగాళ్లు చేసిన చిన్న పొరపాట్ల కారణంగా పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది.  ఇటీవలే బిసిసిఐ ఎంతో పక్కా ప్లానింగ్ తో ఆటగాళ్లను బయో బబుల్ లో ఉంచి ఐపీఎల్ మ్యాచ్ నిర్వహించింది.  ఆటగాళ్లు చేసిన చిన్న పొరపాటుతో ఇక బయో బబుల్ లోకి కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చి వరుసగా ఆటగాళ్లు వైరస్ బారిన పడటం మొదలయ్యింది. దీంతో ఐపీఎల్ నిరవధికంగా వాయిదా వేసే పరిస్థితి వచ్చింది.



 చిన్నపాటి పొరపాటు కారణంగా వందల కోట్ల నష్టం వాటిల్లింది. ఇక ఇప్పుడు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెటర్లు కూడా ఇదే తరహా పొరపాట్లు చేశారు. చివరికి సస్పెండయ్యారు. బయో బబుల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ముగ్గురు శ్రీలంక క్రికెటర్లపై ఆ దేశ క్రికెట్ బోర్డు వేటు వేసింది  సిగరెట్ కాల్చాలి అనుకున్న ముగ్గురు క్రికెటర్లు ఇక నిబంధనలు ఉల్లంఘించి బయో బాబుల్ నుంచి బయటకు వచ్చి రోడ్డుపై సిగరెట్లు కాలుస్తూ కెమెరా కంటికి చిక్కారు. శ్రీలంక స్టార్ ప్లేయర్ లు కుశాల్ మెండిస్, నిరోషాన్ డిక్వెల్లా, ధనుష్క గుణతిలకలను  వెంటనే స్వదేశానికి పైన కావాలని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. బయో బబుల్ అతిక్రమించినందుకు ముగ్గురు ఆటగాళ్లపై వేటు పడటం మాత్రం సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: