ఒక సిక్సర్ కి 20 వేల రూపాయలు.. ఆశ్చర్య పోతున్నారు కదా.. కానీ ఇది నిజమే ఒక్క సిక్స్ కి 20000 రూపాయలు.. ఆగండాగండి.. ఒక సిక్సర్ కి 20 వేల రూపాయలు అనగానే మీరు కొంపతీసి బెట్టింగ్ అనుకుంటున్నారా ఏంటి.. అలా అనుకున్నారంటే పప్పులో కాలేసినట్లే.. ఇక్కడ ఒక సిక్సర్ కి 20000 రూపాయలు ఇస్తున్నారు అన్నది నిజమే.. కానీ మనం చెప్పుకునేది బెట్టింగ్ రాయుళ్ల గురించి కాదు.. మంచి పని చేస్తున్న ఒక సంస్థ గురించి. ఎన్నో రోజుల నుంచి క్రికెట్ ప్రేక్షకులందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇటీవలే ముగిసింది అన్న విషయం తెలిసిందే.



 ఎంతో ఉత్కంఠ భరితంగా హోరాహోరీగా సాగిన ఐపీఎల్ లో చివరికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించి టైటిల్ గెలుచుకుంది.  అయితే చివరి అంకం వరకు కూడా అన్ని జట్లు ఎంతో హోరా హోరీ గానే టైటిల్ కోసం పోరాడాయ్ అని చెప్పాలి. ఇక మునుపెన్నడూ లేని విధంగా ఈ సీజన్ ఐపీఎల్ ప్రేక్షకులందరికీ అదిరిపోయే క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అందించింది. ఇంతకీ ఇలా ఒక సిక్సర్ కి 20 వేల రూపాయలు ఏంటి అని అంటారా. సాధారణంగా ఐపీఎల్లో సిక్సర్ల వర్షం కురుస్తూ ఉండటం చూస్తూ ఉంటాం.  క్రీజు లోకి వచ్చిన ప్రతి ఆటగాడు కూడా బంతిని బౌండరీ దాటించేందుకు ప్రయత్నిస్తూంటాడు.  అయితే ఇటీవలే ఆటగాళ్లు కొట్టిన సిక్సర్ లే ఒక మంచి పనికి ఉపయోగపడుతున్నాయి.



 ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ప్రధాన స్పాన్సర్గా కొనసాగుతోంది డిహెచ్ఎల్ ఎక్స్ప్రెస్ లిమిటెడ్. అయితే ఈ సంస్థ ఇప్పుడు ఒక గొప్ప పని చేసేందుకు సిద్ధమైంది. దివ్యాంగ మహిళల క్రికెట్ కు అండగా నిలవాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే వినూత్నంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. 2021 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టులోని ఆటగాళ్లు  కొట్టిన సిక్సర్ లకు అనుగుణంగా సహాయం చేయాలి అని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు కొట్టిన ప్రతి సిక్సర్ కి కూడా 20 వేల రూపాయల చొప్పున మహిళల క్రికెట్ కోసం  విరాళం ఇవ్వడానికి సిద్ధం అయింది. అయితే 2021 సీజన్లో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు మొత్తంగా 76 సిక్సర్లు కొట్టారూ. దీన్ని బట్టి చూస్తే 15.20  లక్షల రూపాయలు అవుతుంది. ఇక ఈ మొత్తాన్ని ఇస్తామని డిహెచ్ఎల్ సంస్థ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: