టెస్టుల్లో వన్డే సిరీస్ మొత్తం ఎందుకు కోల్పోయింది ? దీనికి కారణాలేంటి? టీమిండియాలో ఎందుకు ఇంత సంక్షోభం తలెత్తింది? ఎన్నో ఆశలతో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది టీం ఇండియా. కానీ చివరకు ఇటు టెస్టుల్లో అటు వన్డేల్లో సిరీస్ కోల్పోయి ఉత్త చేతులతో ఇంటిముఖం పట్టింది. విజయాలు దక్కగపోగా బోలెడన్ని సమస్యలు మూటగట్టుకుంది భారత్. ఆ సమస్యల్ని సత్వరం పరిష్కరించుకోకుంటే మున్ముందు చిన్నపాటి సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పేలా లేదు. భారత క్రికెట్లో కెప్టెన్సీ గురించి పెద్ద చర్చ జరిగిందంటే సౌరవ్ గంగూలీ పై వేటు పడ్డప్పుడే.

మళ్లీ ఇప్పుడు నాయకత్వ మార్పు పెద్ద వివాదానికి దారి తీసింది. కోహ్లీ ని వన్డే కెప్టెన్ గా తప్పించడం ఇప్పుడు భారత్ క్రికెట్ ని ఒక సందిగ్ధస్థితి కి తీసుకచ్చింది. తనతో సెలెక్టర్లు, బీసీసీఐ వ్యవహరించిన తీరుతో మనస్థాపానికి గురై టెస్టు పగ్గాలు కూడా వదిలేసాడు కోహ్లీ. ఇప్పుడు టెస్టు కెప్టెన్ ఎవరూ అనే అయోమయం అందరిలో నెలకొంది. టెస్టుల్లో రోహిత్ ఇంకా స్థిరత్వం సాధించలేదు. ఈ నేపథ్యంలో రాహుల్ కు అవకాశం దక్కుతుందనుకున్నారు. కానీ జట్టు నడిపించిన ఒక టెస్టు మ్యాచ్ లో ఆ తర్వాత వన్డే సిరీస్ లో కెప్టెన్ గా ఆకట్టుకోలేకపోయారు. శ్రేయస్, పంత్ లాంటి వాళ్ళు కెప్టెన్సీ అందుకునేంత పరిణితి ఇంకా సాదించలేదన్నది విశ్లేషకుల మాట. దీంతో కోహ్లీ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ధోని జోరు తగ్గినప్పటినుంచి భారత్ ఇబ్బంది పడుతోంది. క్రేజ్ లో మునుపటిలా సౌకర్యం కనిపించడం లేదు విరాట్. స్వేచ్ఛగా షాట్ లు ఆడలేకపోతున్నాడు, ఇన్నింగ్స్ లో వేగమున్నట్లు లేదు. కెప్టెన్సీ వివాదంతో మానసికంగా మరింత దెబ్బ తిన్నట్లు, అతడి వాలకం చూస్తుంటే మునుపటి ఫాం అందుకుంటాడన్న ఆశలు అంతకంతకీ తగ్గిపోతున్నాయి. టీమ్ ఇండియాను మరికొద్ది కాలంగా మిడిలార్డర్ సమస్య కూడా వేదిస్తోంది.ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో రోహిత్ తో పాటు కే. ఎల్ రాహుల్, రిషబ్ పంత్ కూడా కెప్టెన్సీ బరిలో నిలిచారు.

ఇప్పుడు బీసీసీఐ తెలుపు, ఎరుపు బంతులకు ఎవరెవరు కెప్టెన్ లను నియమించాలని అనుకుంటోందా లేక ఇంతకుముందు లాగా మూడు ఫార్మాట్ లకు ఒకే కెప్టెన్ ను కొనసాగించాలని భావిస్తోందా అన్నది చాలా కీలకంగా మారింది. అలాగే బీసిసిఐ ఈ సమస్యకు తక్షణ పరిష్కారాన్ని కనుక్కోవాలనుకుంటుందా లేక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలనుకుంటుందా అన్నదీ ముఖ్యమే. కెప్టెన్ ఎవరన్న నిర్ణయంలో ఆచితూచి అడుగు వేయాలని బిసిసిఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే శ్రీలంకతో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్ కంటే ముందే కెప్టెన్ ని ప్రకటించవచ్చని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: