ధోని రిటైర్ అయిన తర్వాత టీమిండియాలో అసలు సిసలైన మిడిలార్డర్ బ్యాట్స్మెన్ ఎవరు.. ఇక మ్యాచ్ ను ఎంతో ఘనంగా ముగించే ఫినిషర్  ఎవరు అంటే  భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కన్ఫ్యూజన్లో మునిగిపోతారు. ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత ఆ రేంజిలో భారత క్రికెట్ లో ఎవరు ఫినిషిర్ పాత్ర పోషించలేదూ. ఒక రకంగా చెప్పాలంటే ధోని జట్టు నుంచి తప్పుకున్న తర్వాత టీమిండియాకు మిడిలార్డర్ సమస్య ఎంతగానో వేధిస్తోంది. ఇక మిడిలార్డర్ లో ఎంతోమంది ఆల్రౌండర్లను  తీసుకూవచ్చినప్పటికీ మున్నాళ్ళ ముచ్చట అన్న విధంగా కేవలం కొన్ని మ్యాచ్ల్లో మాత్రమే మంచి ప్రదర్శన చేసి ఆ తర్వాత పేలవా ప్రదర్శనతో జట్టులో స్థానం కోల్పోయారు అందరు.



 దీంతో అటు ఓపెనర్లు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లు బాగా రాణిస్తున్నప్పటికీ మిడిలార్డర్లో మాత్రం ఎప్పుడూ సరైన ఆటగాళ్లు లేక ఎన్నోసార్లు టీమిండియాకు మైనస్ గా మారిపోయింది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ధోని స్టైల్లో మ్యాచ్ మిగించే ఒక ఫినిషెర్ కావాలి అని ఎంతో మంది ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారూ. ఇలాంటి సమయంలోనే ఇటీవలే జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు వెంకటేష్ అయ్యర్. గతంలో ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన వెంకటేష్ అయ్యర్. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్ లో కూడా మంచి బ్యాటింగ్ తో అదరగొట్టాడు.



 అయితే టి20 సిరీస్ కు ముందు వన్డే సిరీస్లో 24,  3 పరుగులు మాత్రమే చేసిన వెంకటేష్ అయ్యర్ టి20 సిరీస్లో  బ్యాటింగ్లో మాత్రం అదరగొట్టాడు. మొదటి మ్యాచ్లో 13 బంతుల్లో 24, తర్వాత 18 బంతుల్లో 33,  ఇక మూడో మ్యాచ్లో 19 బంతుల్లో 37 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇలా మూడు మ్యాచ్ లలో కూడా చివరలో మెరుపులు మెరిపిస్తూ అద్భుతమైన బ్యాటింగ్తో అదరగొట్టాడు   అంతేకాదు 2.1 ఓవర్లు వేసిన వెంకటేష్ అయ్యర్ రెండు కీలకమైన వికెట్లను పడగొట్టి ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. దీంతో టీమిండియాకు ఫినిషర్ దొరికేసాడు అంటూ ఎంతో మంది అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: