సాధారణంగా 106 ఏళ్ళ వయసులో ఎవరైనా ఏం చేస్తారు హాయిగా కృష్ణా రామా అనుకుంటూ ఇంట్లో రెస్టు తీసుకుంటూ మనవళ్లు మనవరాళ్లతో ఆడుకుంటారు . ఇక మరి కొంతమంది అయితే ఆ వయసులో కనీసం మంచం నుంచి లేవ లేరు అని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక 106 భామ మాత్రం లేటు వయసులో కూడా తగ్గేదే లేదు అంటుంది. 106 ఏళ్ళ వయసులో 100 మీటర్ల రన్నింగ్ రేస్ లో పాల్గొని స్వర్ణపతకం గెలిచింది. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అందరూ ఈ బామ్మ గురించి తెలిసి అవాక్కవుతున్నారు అని చెప్పాలి.


 నేటి రోజుల్లో 30 ఏళ్లకే బారెడు పొట్ట వేసుకుని నడవడానికి కూడా ఇబ్బంది పడి పోతూ ఉన్నారు జనాలు. అంతేకాదు వ్యాయామం చేయడానికి కూడా అలసత్వం వహిస్తున్నారు అని చెప్పాలి. ఇక 40 ఏళ్లు వచ్చాయంటే చాలు ఏదో వృద్ధులం అయిపోయాను అనగా ఇంట్లో రెస్టు తీసుకున్నారు. ఇలాంటి వారికి ఈ 106 బామ్మ ప్రస్తుతం స్ఫూర్తిగా నిలుస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆమె ప్రతిభ గురించి తెలిసి ఆమెకు దేశం మొత్తం  జేజేలు పలుకుతోంది అనే చెప్పాలి. హర్యానా రాష్ట్రంలోని సార్కి దాద్రికి చెందిన రమాబాయి అనే 106 ఏళ్ల బామ్మ గత 12 నెలలుగా జాతీయ అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొంటూ ఉంది. ఈ క్రమంలో ఎన్నో మెడల్స్ కూడా గెలుచుకుంటుంది. ఇటీవలే గుజరాత్ లో నిర్వహించిన ఇండియన్ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో 100 మీటర్ల పరుగు లో రాంమబాయ్ పోటీ పడింది.


 ఈ క్రమంలోనే ఈ వంద మీటర్ల పరుగులో గెలిచి ఏకంగా గోల్డ్మెడల్ సాధించింది ఈ 106 ఏళ్ల బామ్మ. ఈ వయసులో కూడా పరుగులు ఏమాత్రం తడబడకుండా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక 82 ఏళ్ల జగదీష్ 100 మీటర్ల పరుగు లో రెండవ స్థానంలో నిలవడం గమనార్హం  ఏదేమైనా ఇక ఈ వందేళ్ల బామ్మ ఫిట్నెస్ కి అందరూ ఫిదా అయిపోతున్నారు అని చెప్పా. లి ఇక 106 ఏళ్ల బామ్మ గోల్డ్ మెడల్ సాధించింది అటు వార్త సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: