అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా ప్రారంభించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నా ఆగస్టులో నిర్వహించాల్సిన  ఆసియాకప్ పై మాత్రం ఇప్పటివరకు ఒక క్లారిటీ లేకుండా పోయింది. శ్రీలంక వేదికగా ఆగస్టులో ఆసియా కప్ నిర్వహించాల్సి ఉంది అన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో పాటు రాజకీయ పరిణామాలు కూడా అంతగా బాగాలేవు. దేశ అధ్యక్షుడు ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.


 దీంతో దేశంలో తీవ్ర ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే ఆసియా కప్ ఆగస్టులో అనుకున్న ప్రకారం నిర్వహిస్తారా లేదా అన్న దానిపై మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే సరిగ్గా రెండు రోజుల క్రిందట శ్రీలంకలో ఆస్ట్రేలియా జట్టు పర్యటించింది. మూడు ఫార్మాట్లకు సంబంధించిన సిరీస్లను ఆడింది. దీంతో అక్కడ ఆసియా కప్ నిర్వహించిన పెద్దగా ఇబ్బందులు ఉండవు చెప్పకనే చెప్పినట్లు అయ్యింది. ఈ క్రమంలోనే ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసియా కప్ నిర్వహణపై స్పందించాడు. శ్రీలంకలో పరిస్థితులను ఎప్పటికప్పుడు  పరిశీలిస్తున్నాము అంటూ చెప్పుకొచ్చాడు.


 అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తొందరపడి ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని అంటూ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ఇక భారత్ ఆతిథ్యం ఇవ్వగలదా లేదా అనేది కూడా ఇప్పుడే ఏమీ చెప్పలేం. శ్రీలంకలో పరిస్థితులను మాత్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాము. ఆస్ట్రేలియా ఇప్పటికే మూడు ఫార్మాట్లకు సిరీస్ లు ఆడింది. శ్రీలంక కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆతిథ్యం వహించింది. అందుకే ఇప్పుడే ఏం మాట్లాడలేము. ఆసియా కప్ నిర్వహణకు నెల రోజుల సమయం ఉంది. కాబట్టి కొన్నాళ్ళ వరకు వెయిట్ చేద్దాం అంటూ సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. కాగా సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: