దినేష్ కార్తీక్ గత కొంత కాలం నుంచి టీమిండియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. మొన్నటి వరకు అసలు టీమిండియాలో చోటు దక్కని ఈ ప్లేయర్ ఇక ఇప్పుడు టీమిండియాలో అసలుసిసలైన ఫినిషెర్ పాత్రను పోషిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు అతని ఏజ్ అయిపోయింది కామెంటేటర్ గా సెటిల్ అవుతే బెటర్ అని విమర్శలు చేసిన వారు ఇక ఇప్పుడు దినేష్ కార్తీక్ అద్భుతమైన ఇన్నింగ్స్ లకు చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోతున్నారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ ద్వారా జట్టులోకి పునరాగమనం చేసిన దినేష్ కార్తీక్ తనకు తిరుగు లేదు అని నిరూపిస్తున్నారు. కెరీర్లోనే అత్యుత్తమ మైన ఫాంలో కొనసాగుతు అదరగొట్టేస్తున్నాడు అని చెప్పాలి.


 ఆటగాళ్ల నుంచి తీవ్రమైన పోటీ ఉన్న సమయంలో 37 ఏళ్ల దినేష్ కార్తీక్ జట్టులో స్థానం దక్కించుకోవడం అంటే అది ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. అయితే ఐపీఎల్ ద్వారా జట్టులో అవకాశం దక్కించుకున్న దినేష్ కార్తీక్ భారత జట్టులో కూడా తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు. వరుసగా టీమిండియా ఆడుతున్న టి20 సిరీస్ లో అవకాశం దక్కించుకుంటూ  తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా అద్భుతమైన ఫినిషింగ్ ఇస్తున్నాడు అని చెప్పాలి. ఇటీవలే వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా ఆడిన మొదటి 20 మ్యాచ్ లో కూడా ఇదే తరహా ప్రదర్శన చేశాడు దినేష్ కార్తీక్.


 మొదటి పది బంతులు వరకు ఎంతో ఆచితూచి ఆడాడు. పది బంతుల్లో అతని స్కోర్ కేవలం 12 పరుగులు మాత్రమే. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా గేరు మార్చి విజృంభించాడు అని చెప్పాలి. సిక్సర్లతో వెస్టిండీస్ బౌలర్ లకు షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత 10 బంతుల్లో ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. మొత్తంగా 19 బంతుల్లో 41 పరుగులు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. దినేష్ కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్ నేపథ్యంలో అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది చెప్పాలి.  దినేష్ కార్తీక్ ప్రదర్శన నేపథ్యంలో అతనికి వరల్డ్ కప్ జట్టులో స్థానం ఫిక్స్ అయినట్లే అని ప్రస్తుతం మాజీ ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: