గత కొంత కాలం నుంచి టీమిండియా జట్టు ప్రయోగాలకు అడ్డాగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అక్టోబర్ లో జరగబోయే టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఇక ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఆటగాళ్ల సామర్థ్యాన్ని పరీక్షిస్తూ ఉన్నారు సెలెక్టర్లు. ఈ క్రమంలోనే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ లో కూడా అనూహ్యమైన మార్పులు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వెస్టిండీస్ పర్యటనలో కూడా ఇలాంటిదే జరుగుతుంది అనేది తెలుస్తుంది.  మొన్నటి వరకు శిఖర్ ధావన్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా జట్టు వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించి వెస్టిండీస్ ను క్లీన్స్వీప్ చేసింది.


 ఇటీవలె రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు టి-20 సిరీస్ ఆరంభించింది అన్న విషయం తెలిసిందే. ఇక మొదటి మ్యాచ్లో విజయం సాధించి శుభారంభం చేసింది. అయితే బ్యాటింగ్ ఆర్డర్ లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. నాలుగవ స్థానంలో బ్యాటింగ్ చేసే సూర్యకుమార్ యాదవ్ ను ఓపెనర్ రోహిత్ శర్మ కు జోడీగా తీసుకువచ్చారు. అయితే టీమిండియా చేసిన ఈ ప్రయోగం పై అటు మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే గత కొంత కాలం నుంచి ఓపెనర్లను వరుసగా మారుస్తూ వస్తూనే వస్తుంది బిసిసిఐ. ఇక ఇదే విషయాన్ని ఉద్దేశిస్తూ రోహిత్ పై  ఘాటు వ్యాఖ్యలు చేశాడు మహమ్మద్ కైఫ్.


 సూర్య కుమార్ యాదవ్ ను ఓపెనింగ్లో పంపించడం నాకైతే అసలు అర్థం కాలేదు. రిషబ్ పంత్ ను ఓపెనర్గా దించాలని రెండు మ్యాచ్ లలో అవకాశమిచ్చింది టీమిండియా మేనేజ్మెంట్. ఇక మొదటి మ్యాచ్లో  కూడా అతనే రోహిత్ తో పాటు ఓపెనర్గా పంపించాల్సింది.  కనీసం అతనికి 5,6 అవకాశాలు  ఇవ్వకుండా ఓపెనర్ గా రిషబ్ పంత్ ని పక్కనపెట్టి సూర్యకుమార్ యాదవ్ ఓపెనింగ్ పంపించారు. మిడిల్ ఆర్డర్ లో సూర్యకుమార్ యాదవ్ మంచి బ్యాట్స్మెన్. ఈ విషయంలో రోహిత్ బుద్ధి తక్కువ పనిచేసాడు అంటూ ఇండైరెక్ట్గా వ్యాఖ్యానించాడు మహ్మద్ కైఫ్. ఇక కోచ్ రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ చేసిన ఈ ప్రయోగం అత్యంత చెత్తది అని అంటూ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: