టీమిండియాలో అవకాశం దక్కించుకున్న తక్కువ రోజుల్లోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్. బౌలింగ్ లో ఒక మరోవైపు బ్యాటింగ్ లో కూడా తన సత్తా ఏంటో చూపించాడు. దీంతో అతను టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్ అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం అతని దురదృష్టం వెంటాడుతూనే ఉంది. వరుసగా గాయాల బారిన పడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే దాదాపు ఒక ఏడాది మొత్తం వాషింగ్టన్ సుందర్ గాయాలతో జట్టుకు దూరంగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2021 ఆగస్టులో గాయం బారిన పడిన తర్వాత  ఇక ఇప్పటి వరకు కూడా జట్టులోకి రాలేదు.

 జట్టులోకి ఎంపికయ్యాడు అన్న ప్రతిసారీ ఏదో ఒక గాయం మళ్లీ తిరగబెడుతుంది. దీంతో జట్టులోకి సెలక్ట్ అవ్వడం గాయం బారినపడి మళ్ళి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ లోకి వెళ్లడం లాంటివి జరుగుతుంది. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్ ఇంగ్లండ్ వేదికగా జరిగిన రాయల్ లండన్ కప్ లో ఆడాడు. ఈ క్రమంలోనే ఫీల్డింగ్  చేస్తున్న సమయంలో  భుజానికి గాయమైంది. పరీక్షలు చేయగా గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలింది.. దీంతో జింబాబ్వే పర్యటనకు సెలెక్ట్ అయ్యాడు. కానీ చివరికి గాయంతో దూరమయ్యాడు. 2021 జూలైలో చేతి వేలికి గాయమైంది. ఇక ఇంగ్లండ్లో నాలుగు టెస్టుల సిరీస్ తో పాటు ఐపీఎల్ కూడా దూరమయ్యాడు.

 తర్వాత జనవరి 2022 లో కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఇక అంతకుముందు  కోలుకొని విజయ్ హజారే ట్రోఫీ లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. సౌతాఫ్రికాలో వన్డే సిరీస్కు ఎంపిక అయ్యాడు. కానీ అతని కరోనా వైరస్ జట్టుకు దూరం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తొడ కండరాలు పట్టేయడం తో స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన సిరీస్కు ఎంపికైనప్పటికీ ఒకే ఒక మ్యాచ్ కి మాత్రమే పరిమితం అయ్యాడు.  ఫీల్డింగ్ చేస్తూ తొడ కండరాలు పట్టేయడం తో మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయాడు. ఏప్రిల్ లో చేతికి గాయం కారణంగా విండీస్, లంకతో సిరీస్లకు దూరమయ్యాడు. ఇక ఇప్పుడు జింబాబ్వే పర్యటనలో ఆగస్టులో భుజం గాయం కారణంగా మరోసారి దూరమయ్యాడు. ఇలా ఒక ఏడాది మొత్తం జట్టుకు దూరంగా  గాయలతో నే సహవాసం చేస్తున్నాడు వాషింగ్టన్ సుందర్.

మరింత సమాచారం తెలుసుకోండి: