ఇటీవలి కాలంలో ఎంతో మంది భారత్ పాకిస్థాన్ క్రికెటర్లు స్నేహితుల్లా మెలుగుతూ క్రీడాస్ఫూర్తిని చాటుతూ ఉన్న నేపథ్యంలో కొంతమంది క్రికెటర్లు మాత్రం భారత జట్టుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి పై కూడా తన అక్కసును వెళ్లగక్కటానికి   ఎప్పుడూ కారణాలను వెతుకుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఎంతోమంది పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు తమ యూట్యూబ్ ఛానల్ వేదికగా భారత్ క్రికెటర్లపై ప్రశంసలు కురిపిస్తూ ఉంటే ఇటీవలే పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహమ్మద్ హఫీస్ మాత్రం రోహిత్ శర్మ గురించి అతని బాడీ లాంగ్వేజ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.


 అయితే ఇప్పుడు మరోసారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహమ్మద్ ఆఫీస్ భారత క్రికెట్ నియంత్రణ మండలి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నాకు ఒక విషయం బాగా తెలుసు.. సొసైటీలో డబ్బులు ఎక్కువగా ఉన్న వారి పైన జనాలు ప్రేమ ఇష్టంతో  ఎక్కువగా ఉంటారు. ఇక వారికి ఎక్కువగా ముద్దులు దక్కుతాయి. మమకారం కూడా దక్కుతుంది. అయితే ఇప్పుడు భారత జట్టు పరిస్థితి అలాంటిది మహ్మద్ హఫీజ్  షాకింగ్ కామెంట్ చేశాడు.  ఐపీఎల్ వల్ల బోలెడు డబ్బు వస్తుంది. బిసిసీఐ  దగ్గర ఎంతో డబ్బు ఉంది. అందుకే టీమిండియాపై ద్వైపాక్షిక సిరీస్ ప్రపంచవ్యాప్తంగా జనాలు చూస్తారు. వాళ్లు బాగా ఆడాలని అందరూ అనుకుంటూ ఉంటారు.

 ఇక టీమిండియా తో సిరీస్  ఆడితే ఆ జట్టు జాక్పాట్ కొట్టినట్లే. ఎందుకంటే స్పాన్సర్లు ఎగబడుతుంటారు. ఎవరికైనా కావాల్సింది ఆదాయం లాభమే కదా.. ఇది ఎవరూ కాదనలేని నిజం అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు మాజీ క్రికెటర్ హఫీజ్.  టీమిండియా పై మమకారం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు వల్లేనా లేకపోతే వారి ఆట తీరు వల్ల అంటూ యాంకర్ ఎదురు ప్రశ్నించింది. దీంతో కాస్త తడబడిన మహమ్మద్ హఫీజ్  ఆట అనేది డబ్బు తర్వాత విషయం అంటూ కామెంట్ చేయడం గమనార్హం. దీంతో టీమిండియా ఫాన్స్ అందరు ఎంతో  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: