మొన్నటికి మొన్న భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళిన సమయంలో మూడవ వన్డే మ్యాచ్ జరుగుతున్న సమయంలో భారత బౌలర్ దీప్తి శర్మ ఇంగ్లాండ్ బాటర్ డీన్ ను మన్కడింగ్ విధానంలో రన్ అవుట్ చేయడం సంచలనంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ ఘటన జరిగి ఎన్నో రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఇందుకు సంబంధించిన చర్చ మాత్రం జరుగుతూనే ఉంది అని చెప్పాలి. మన్కడింగ్ చేయడం అనేది క్రీడా స్ఫూర్తిగా విరుద్ధమని ఎంతోమంది విమర్శలు చేస్తుంటే.. రూల్ ప్రకారమే భారత బౌలర్ ప్రవర్తించింది అంటూ  కొంతమంది కౌంటర్ ఇస్తున్నారు.


 నాన్ స్ట్రైకర్ ముందుకు వెళ్లిన సందర్భంలో చేసే అవుట్ చట్టబద్ధమైనది కాదు అంటూ ఎంతో మంది ఇంగ్లాండు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఇదే వివాదంపై ఇంగ్లాండ్ ఫేసర్  జేమ్స్ అండర్సన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాన్స్ట్రైకర్ గా ఉన్న బ్యాటర్ ముందుకు వెళ్ళినప్పుడు రన్ అవుట్ చేయడం చట్టబద్ధం కాదు అని చెప్పేందుకు ప్రయత్నించాడు. మన్కడిన్ సంఘటనపై 30 సెకండ్ల పాటు ఆలోచించినప్పుడు తనకు కాస్త ఆగ్రహం వచ్చింది అంటూ తెలిపాడు.


 ఇక ప్రతి ఒక్కరికి కూడా తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇలాంటి రన్ అవుట్ చేసేందుకు ముగ్గు చూపనీ జట్టుతో తాను ఆడుతున్నాను అంటూ తెలిపాడు. ప్రస్తుతం దీన్ని చట్టబద్ధం చేశారు. ఇక అలా రనౌట్ చేయడాన్ని ఇక అవుట్ గానే పరిగణించాలి అంటూ చెప్పుకొచ్చాడు. ఇకనుంచి అయినా ఆటగాళ్లు క్రీజులో ఉండేందుకు ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. చార్లీ డీన్ కు జరిగిన దానిపై చాలా ఫీల్ అవుతున్నాను. ఆమె రన్ అవుట్ అవ్వకుండా ఆడి ఉంటే ఇంగ్లాండు తప్పకుండా గెలిచేది. అయితే దీప్తి శర్మ బౌలింగ్ చేయడానికి వచ్చినట్లు లేదని చార్లీ డీన్ ముందుకు వెళ్లడం గమనించి రనౌట్ చేసింది అంటూ తెలిపాడు జేమ్స్ అండర్సన్.

మరింత సమాచారం తెలుసుకోండి: