ఇక ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరి లోకి దిగేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. కాగా రోహిత్ ను సాధారణం గా టైటిల్ విన్నింగ్ కెప్టెన్ అంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటికే ఐపీఎల్ లో ఎవరికి సాధ్యం కాని విధంగా తక్కువ సమయం లో ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ అందుకున్న కెప్టెన్గా కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ. ఇక ఇప్పుడు మొదటిసారి రోహిత్ కెప్టెన్సీలో వరల్డ్ కప్ లో బలిలోకి దిగబోతుంది టీమ్ ఇండియా. దీంతో ఈసారి టీమిండియా వరల్డ్ కప్ నెగ్గడం ఖాయం అని ఎంతోమంది ధీమా వ్యక్తం చేస్తున్నారు.
15 ఏళ్ల నిరీక్షణకు రోహిత్ తెరదించుతాడు అంటూ అభిప్రాయ పడుతున్నారు. ఇక వరల్డ్ కప్ లో కెప్టెన్సీ వహించడంపై పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ కూ ముందు మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ.. ఐసీసీ టోర్నమెంట్ గెలవడం మాకు ఒక ఛాలెంజ్.. దాన్ని ఒక ఒత్తిడిగా తీసుకోము. ఇక పాకిస్తాన్ బౌలింగ్ చాలా బాగుంది. అదే టైంలో మా బ్యాటింగ్ కూడా బాగుంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ప్రేక్షకులకు మంచి మ్యాచ్ అవుతుంది. ఇక నేను కెప్టెన్సీ తీసుకున్నప్పటినుంచి నాకు సారధిగా ఇదే పెద్ద మ్యాచ్అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి