ఎందుకో క్రికెటర్స్ కి సినీ తారలకి విడదీయరాని అనుబంధం ఉందేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి సినీ తారలు క్రికెటర్లను లవ్వాడటం జరుగుతూనే వస్తూ ఉంది అని చెప్పాలి. అయితే కొంతమంది ఇలా లవ్ లో పడి కొన్నాళ్లపాటు ప్రేమలో మునిగితేలీ ఆ తర్వాత పెళ్లి కాకుండానే విడిపోయిన వారు ఉన్నారు. ఇంకొంతమంది ఏకంగా తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లి చివరికి ప్రేమకు ప్రమోషన్ ఇచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పాలీ. ఇలా కొన్ని దశాబ్దాల నుంచి కూడా క్రికెటర్లు సినిమా హీరోయిన్లు ప్రేమలో పడటం జరుగుతూనే ఉంది.


 ఇక ఇలా క్రికెటర్లు ఎవరైనా సినీ తారలని లవ్  చేస్తున్నారూ అన్న వార్త తెర మీదకి వచ్చింది అంటే చాలు అది కాస్త హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇక్కడ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక ప్రేమ వార్తపై ఏకంగా స్వయంగా నటి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది అని చెప్పాలి. మరాఠీ నటి సయ్యాలి సంజీవ్ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ మధ్య ఏదో ఉంది అంటూ పుకార్లు షికార్లు చేశాయి. మీడియా కంట పడకుండా ఫ్రెండ్షిప్ పేరుతో వీరిద్దరూ తెగ లవ్ లో మునిగితేలుతున్నారు అంటూ ఎంతో మంది చర్చించుకోవడం మొదలుపెట్టారు.


 ఇకపోతే ఇటీవలే ఈ రూమర్స్ పై స్పందించిన సయ్యాలి సంజీవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మా మధ్య ఏం లేదు. ఈ పుకార్ల వల్ల మా మధ్య స్నేహం దెబ్బతింది. కనీసం మంచి స్నేహితులుగా కూడా మాట్లాడుకోలేకపోతున్నామూ. ప్రేమ దోమ ఏమీ లేకపోయినా మమ్మల్ని ఎందుకు లింక్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇక దీనివల్ల మా వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇది పుకార్లు పుట్టించే వాళ్లకు అసలు అర్థం కావడం లేదు. ఇలాంటి పుకార్లు ఇంట్లో వాళ్లకు కూడా సమస్య అని అర్థం చేసుకున్నాం. ఇక అతడు ఎంత బాగా రాణించినా నేను కనీసం అభినందించలేని పరిస్థితిలోకి వెళ్లిపోయాను అంటూ నటి సయాలి సంజీవ్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: