
అయితే ఎవరూ ఊహించని విధంగా రోహిత్ శర్మ గాయపడటంతో అతని స్థానంలో జట్టులో అవకాశం దక్కించుకున్న ఇషాన్ కిషన్ అడపా దడపా ప్రదర్శన మాత్రమే చేస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో డబుల్ సెంచరీ తో చెలరేగిపోయి జట్టుకు విజయాన్ని అందించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు అటు ప్రపంచ క్రికెట్లో ఏ ఆటగాడికి సాధ్యం కానీ ఒక అరుదైన రికార్డును ఇషాన్ కిషన్ సృష్టించాడు అని చెప్పాలి. ఇప్పుడు వరకు ఇషాన్ కిషన్ వన్డే ఫార్మాట్లో ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు అని చెప్పాలి.
ఇలా వన్డే ఫార్మాట్లో ఒక్క సెంచరీ కూడా చేయకుండా డైరెక్ట్‌గా డబుల్ సెంచరీ చేసిన క్లబ్లో చేరిన తొలి ప్లేయర్ గా ప్రపంచ రికార్డును సృష్టించాడు ఇషాన్ కిషన్. ఇక కెరియర్లో 9 ఇన్నింగ్స్ లోనే డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్ అతి తిన్న వయస్కుడిగా, ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించిన వీరుడుగా కూడా పలు రికార్డులను బద్దలు కొట్టాడు అని చెప్పాలి. అయితే ఇక ఈ మ్యాచ్ లో భాగంగా భారత జట్టు 227 పరుగుల తేడాతో విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. ఇషాన్ కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్ గురించి ప్రస్తుతం ప్రతి ఒక్కరు చర్చించుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.