ఇక న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియాకి పెద్ద షాక్ తలిగింది. ఎందుకంటే యంగ్ బ్యాట్స్‌మెన్ అయిన శ్రేయాస్ అయ్యర్ ఈ సిరీస్ కి దూరమయ్యాడు.శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయంతో బాధపడుతున్నట్లు బీసీసీఐ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. టీం మేనేజ్‌మెంట్ శ్రేయాస్ ప్లేస్ లో రజత్ పాటిదార్‌కు అవకాశం కల్పించింది. రేపు అనగా జనవరి 18  వ తేదీ నుంచి భారత్ ఇంకా న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ జరగనుంది. దీనికి ముందు భారత జట్టుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శ్రేయాస్ అయ్యర్ గాయం గురించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ట్వీట్ చేసి సమాచారం ఇచ్చింది.శ్రేయాస్ అయ్యర్ టీమ్ ఇండియాలో చాలా ప్రతిభావంతుడైన ఆటగాడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా సందర్భాలలో ఎంతో అద్భుతమైన ప్రదర్శనతో అతను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అయితే జనవరి 18 వ తేదీ నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు శ్రేయాస్ దూరమయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయంతో చాలా ఇబ్బంది పడుతున్నాడు.


ప్రస్తుతం ఆయన బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నట్లు బీసీసీఐ తెలిపింది. శ్రేయాస్ అయ్యర్‌ను మినహాయించడంతో రజత్ పాటిదార్‌ను టీమ్ ఇండియాలో చేర్చడం జరిగింది. దేశవాళీ మ్యాచ్‌ల్లో రజత చాలా అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే.ఇక భారత గడ్డపై ఫస్ట్ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు న్యూజిలాండ్ ఎంతగానో ఎదురుచూస్తోంది. భారత గడ్డపై కివీ జట్టు ఇప్పటి దాకా మొత్తం 6 సార్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడింది. అయితే ప్రతిసారీ కూడా ఆ టీం ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. 1988-89లో వన్డే సిరీస్‌ ఆడేందుకు న్యూజిలాండ్‌ ఫస్ట్ టైం భారత్‌కు వచ్చింది. గత 34 ఏళ్లలో న్యూజిలాండ్ మొత్తం 6 సార్లు భారత్‌లో పర్యటించింది. కానీ, వన్డే సిరీస్‌లో ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయింది. 2003-04లో భారత గడ్డపై న్యూజిలాండ్ చాలా మంచి ప్రదర్శన చేసింది. ఆపై ట్రై సిరీస్‌లో కివీస్‌ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. టీవీఎస్ కప్ టైటిల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: