
ఈ సిరీస్ తర్వాత ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్ట్ సిరీస్ కు ఫుల్ ఫిట్నెస్ తో ఉండాలన్న సదుద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా మరోసారి హార్దిక్ పాండ్య జట్టును ముందుండి నడిపించనున్నాడు. కివీస్ టీం కూడా మొత్తం జూనియర్ లతో నిండి ఉంది అని చెప్పాలి. మరి ఈ జట్టును ఓడించడం ఇండియాకు పెద్ద కష్టం కాదు, కానీ పొట్టి ఫార్మాట్ లో ఏ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఇండియా జట్టు కూర్పు విషయానికి వస్తే దేశవాళీ టోర్నీలలో వేలకొద్దీ పరుగులు చేస్తూ జట్టులో చోటు దక్కించుకున్న వారికి తుది జట్టులో ఆడే అవకాశం దక్కడం లేదు.
ఈ విషయంలో ఇండియా అభిమానులు జట్టు యాజయాన్యంపై అసంతృప్తిగా ఉన్నారు. కనీసం ఒకటి రెండు అవకాశాలు ఇస్తేనే కదా ఆటగాళ్ల టాలెంట్ తెలిసేది. ఉదాహరణకు... ఈ సిరీస్ కు ముంబై సంచలన ఆటగాడు పృథ్వి షా ఎంపికయ్యాడు. అయితే జట్టు నుండి తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ రోజు జరగనున్న మ్యాచ్ లో అతను బరిలోకి దిగడం లేదట. ఎప్పటిలాగే శుబ్ మాన్ గిల్ మరియు ఇషాన్ కిషన్ లు ఇన్నింగ్స్ ను ఆరంభిస్తారని అధికారిక ప్రకటన వచ్చేసింది. జట్టులో చోటు దక్కే వరకు ఒక బాధ.. తీరా జట్టులో చోటు వచ్చాక మ్యాచ్ ఆడే అవకాశం వస్తుందా లేదా అన్నది మరో బాధ. మరి ఈ సిరీస్ లో పృథ్వి షా కు ఒక అవకాశం అయినా ఇస్తారా లేదా అన్నది చూడాలి.