క్రికెట్ అంటే ఉత్కంఠకు కేరాఫ్ అడ్రస్ అని అందరూ చెబుతూ ఉంటారు . ముఖ్యంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో పరుగులను కట్టడి చేసేందుకు అటు ప్లేయర్లు చేసే విన్యాసాలు అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి అని చెప్పాలి. ముఖ్యంగా కొన్ని కొన్ని సార్లు రన్ అవుట్ అవకాశం లేని సమయంలో కూడా మెరుపు వేగంతో త్రో విసిరి రనౌట్ చేయడం కూడా అప్పుడప్పుడు క్రికెట్లో చూస్తూ ఉంటాం. అందుకే క్రికెట్ అంటే ఉత్కంఠకు చిరునామా అని చెబుతూ ఉంటారు. కానీ యూరోపియన్ క్రికెట్ అంటే మాత్రం ఫన్నీ ఇన్సిడెంట్ కు చిరునామాగా ఎంతో మంది క్రికెట్ అభిమానులు అభివర్ణిస్తూ  ఉంటారు అని చెప్పాలి.


 ఎందుకంటే అంతర్జాతీయ మ్యాచుల్లో ఎప్పుడూ కని విని ఎరుగని ఘటనలు కూడా యూరోపియన్ క్రికెట్లో తరచూ జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి ఘటనలు చూసి నవ్వాలో ఏడవాలో కూడా తెలియని పరిస్థితిలో అటు క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా మునిగిపోతూ ఉంటారు. ఇటీవల  ఇలాంటి తరహా ఘటన జరగగా ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. ఒక బౌలర్ రనౌట్ చేసే ఛాన్స్ ను మిస్ చేసిన తీరు అయితే నవ్వులు పూయిస్తుంది అని చెప్పాలి.  ఇక ఈ వీడియో చూసిన తర్వాత గల్లీ క్రికెటర్లు కూడా ఇంత దారుణంగా క్రికెట్ ఆడలే రేమో  అని నేటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉన్నారు.


 యూరోపియన్ క్రికెట్ సిరీస్ టి10 మాల్ట లీగ్ లో భాగంగా బుగిబా బ్లాస్టర్స్, స్వీకీ యునైటెడ్ మధ్య మ్యాచ్ జరిగింది.  అయితే బ్లాస్టర్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో విబోర్ యాదవ్ వేసిన బంతిని బ్యాటర్ వదిలేస్తాడు. దీంతో బంతి వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. అయితే అప్పటికే నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న బ్యాట్స్మెన్ పరుగు కోసం ప్రయత్నించాడు. ఇక క్రీజు మధ్యలోకి వెళ్లిపోయాడు. అయితే అప్రమత్తమైన వికెట్ కీపర్ బంతిని బౌలర్ కు విసిరాడు. ముందుగా బంతిని సక్రమంగానే అందుకున్న బౌలర్ వికెట్లను గిరాటేయడంలో మాత్రం విఫలమయ్యాడు. ఏదో దూరం నుంచి త్రో చేస్తున్నట్లుగా ఇక వికెట్లకు ఒక అడుగు దూరం నుంచి కూడా వికెట్లను కొట్టలేకపోయాడు. ఈ దీంతో అందరూ ఆశ్చర్య పోయారు అని చెప్పాలీ.

మరింత సమాచారం తెలుసుకోండి: