
కాగా తన ఆట తీరుతో ఇక ఇండియా లో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎందుకంటే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా ప్రత్యేక మైన గుర్తింపును సంపాదించుకున్నాడు. జట్టును ఎంత విజయపతం లో ముందుకు నడిపించి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఇక కెప్టెన్ గా మాత్రమే కాకుండా ఆటగాడిగా కూడా ఎప్పుడూ మంచి ప్రదర్శన చేస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు. ఇకపోతే ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కూడా కేన్ విలియంసన్ మంచి ప్రదర్శన కనబరుస్తూ ఉన్నాడు అని చెప్పాలి.
ఈ క్రమం లోనే ఒక అరుదైన రికార్డును ఖాతా లో వేసుకున్నాడు కేన్ విలియంసన్. ఇటీవల ఇంగ్లాండు తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 132 పరుగులు చేసి సెంచరీ తో కాదం తొక్కాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక అరుదైన ఘనతను సాధించాడు. రాస్ టేలర్ 112 టెస్టుల్లో 7683 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ఉండగా.. ఇక ఇప్పుడు కెన్ విలియంసన్ అతన్ని వెనక్కి నెట్టాడు. కేన్ విలియమ్సన్ 93 టెస్టుల్లోనే 7787 పరుగులు చేసి న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన అడ్డగాడి గా అరుదైన రికార్డులను సృష్టించాడు.