మహిళా క్రికెట్ ను ప్రోత్సహించడమే లక్ష్యం గా ఇక ప్రేక్షకాదరణ  పెంచేందుకు అటు బిసిసిఐ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ లీగ్ ను ఐపీఎల్ తరహాలో సూపర్ హిట్ చేయాలని బీసీసీఐ ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆడేందుకు విదేశీ క్రికెటర్లు సైతం తరలి వచ్చి ప్రస్తుతం భారత్లో వారసగా మ్యాచ్లు ఆడుతున్నారు అని చెప్పాలి.


 ఈ క్రమం లోనే ప్రతి మ్యాచ్ లో కూడా తమ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఇక ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించడమే లక్ష్యం గా అదరగొడుతున్నారు ఎంతో మంది మహిళా క్రికెటర్లు. ఇకపోతే ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా కూడా హోలీ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆడేందుకు భారత్కు వచ్చిన మహిళా క్రికెటర్లు కూడా ఇలా హోలీ సంబరాల్లో మునిగి తేలారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా హోలీ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలను ఎంతోమంది మహిళ క్రికెటర్లు సోషల్ మీడియాలో పంచుకోవడం గమనార్హం. ఈ క్రమం లోనే ఇంగ్లాండ్ క్రికెటర్ హీత్తర్ నైట్ హోలీ ఆడిన ఫోటోలను తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. కలర్ పడటం తో తన జుట్టు మొత్తం పింక్ కలర్ లోకి మారి పోయిందని.. జుట్టు నుంచి పింక్ కలర్ ను ఎలా తొలగించాలి అంటూ ఫోటోలని పోస్ట్ చేస్తూ నేటిజన్స్ ని ఒక ప్రశ్న అడిగింది. అయితే ఇక ఈ మహిళా క్రికెటర్ కు ఎంతో మంది నేటిజన్స్ వింతైన సలహాలు ఇస్తూ ఉండడం గమనార్హం. విమ్ బార్, హార్పిక్,  బ్లీచింగ్ పౌడర్ లాంటివి వాడకండి వాషింగ్ పౌడర్ నిర్మ వాడండి అంటూ ఫన్నీ సలహాలను ఇచ్చేస్తూ ఉన్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: